Big Boss 7 : ఎవరూ ఊహించని ట్విస్ట్...ఓటింగ్‌లో టాప్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
X
ఎన్ని సీజన్లు వచ్చినా బుల్లి తెరపైన ప్రేక్షకుల మనసు దోచుకునే ఏకైక షో బిగ్ బాస్. అందుకే ప్రతి సీజన్లో కొత్త కాన్సెప్టుతో, కొత్త కంటెస్టెంట్లతో మేకర్స్ బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ముందుకు వస్తున్నారు. బుల్లితెరపై ఉన్న అన్ని సరిహద్దులను చెరిపేసిన ఈ షో రకరకాల ఎమోషన్స్‌ను బుల్లితెరపై పండిస్తూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తోంది. అందుకే తెలుగులో ఈ షోకు సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటివరకు రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారం ఓటింగ్‌లోకి ఎంటర్ అయ్యింది.
ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నిర్వహకులు ఈసారి బిగ్ బాస్ 7వ సీజన్‌ను ప్రయోగాత్మకంగా మొదలు పెట్టారు. షో స్టార్ట్ అయినప్పటి నుంచే ఎన్నడూ చూడని కంటెంట్ తో ముందుకువెళ్తున్నారు. అయినప్పటికీ ఈసారి బిగ్ బాస్‌కు ఆదరణ మాత్రం అంతంతగానే వస్తోందని రేటింగ్స్‌ను అర్థమవుతోంది. నామినేషన్ల సమయంలోనూ షో రసవత్తరంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. నామినేష్లలో భాగంగా ఇప్పటి వరకు హౌస్ నుంచి కిరణ్ రాథోడ్, షకీలా బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం హౌస్‌లో మూడోవారం ఓటింగ్ జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఈసారి 7 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వారిలో ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతికా రోజ్, శుభశ్రీ , అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, దామినిలు ఉన్నారు. వీరిలో టేస్టీ తేజ స్థానంలో అమర్‌ను స్వైప్ చేశారు.
మూడో వారం ఓటింగ్ ప్రక్రియ ఎంతో రసవత్తరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ ఊహించని విధంగా వీక్ కంటెస్టెంట్లకు ఎక్కువగా సపోర్ట్ లభిస్తుంది. అమర్‌దీప్ చౌదరి, రతికా రోజ్ వంటి టాప్ కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ షాకింగ్‌గా ఈసారి ప్రిన్స్ యావర్ టాప్‌లో నిలిచాడు. అమర్‌దీప్ చౌదరి రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో శుభశ్రీ , రతిక నాలుగో స్థానంలో, ప్రియాంక జైన్ ఐదో స్థానంలో ఉన్నారు. ఈ ఓటింగ్‌లో గౌతమ్ కృష్ణ ఆరో స్థానంలో ఉన్నాడు. దామిని ఏడో స్థానంలో నిలిచింది. అంటే ఈ ఎలిమినేషన్లలో ప్రస్తుతం దామిని, గౌతమ్ కృష్ణలు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్‌కు ఇంకా మూడు రోజులు సమయం ఉంది. ఈ క్రమంలో ఈ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.