Home > సినిమా > Bigg Boss season 7: హౌస్ మేట్స్ అందరినీ ఏడిపించిన బిగ్ బాస్

Bigg Boss season 7: హౌస్ మేట్స్ అందరినీ ఏడిపించిన బిగ్ బాస్

Bigg Boss season 7: హౌస్ మేట్స్ అందరినీ ఏడిపించిన బిగ్ బాస్
X

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 బాగా రక్తి కడుతోంది. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుల ఊహకు అందనంతగా ఆకట్టుకుంటోంది. నాగార్జున హోస్టింగ్ కూడా ఈ సారి మరింత రఫ్ గా మారింది. ఇంతకు ముందులా కాకుండా ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ మధ్య గేమ్స్ కూడా టఫ్ గానే ఉంటున్నాయి. గతంలో లాగా లవ్ స్టోరీస్, గ్రూప్ గేమ్స్ తక్కువగా ఉంటూ సాధ్యమైనంత వరకూ స్ట్రాంగ్ గానే ఉంటున్నారు. అయితే తాజాగా వచ్చిన ప్రోమో చూస్తే ఇన్ని రోజులు కనిపించని ఒక ద్రుశ్యం కనిపిస్తోంది.

ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ అవడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ అంటూ మొదలైన ప్రోమోలో.. కంటెస్టెంస్ట్స్ అందరికీ కొన్ని లెటర్స్ వచ్చాయి. ఆ లెటర్స్ లో ఇప్పటి వరకూ వారు కోరుకున్న అంశాలతో పాటు ఇతర వివరాలు కూడా కావాలంటే కొందరు త్యాగం చేయాలి. అయితే ఆ లెటర్స్ వచ్చింది.. వారి ఇళ్ల నుంచి. దీంతో కంటెస్టెంట్స్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా సందీప్ మాస్టర్ వెక్కి వెక్కి ఏడుస్తూ.. త్రీ వీక్స్ నుంచి అడుగుతున్నాను మా మదర్ హెల్త్ గురించి అనగానే.. అమ్మంటే ఏం మాట్లాడలేకపోతున్నాను మాస్టర్ నేను అంటూ అమర్ అతన్ని ఓదారుస్తూనే తనూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక టేస్టీ తేజ్ గుక్కపట్టి ఏడుస్తూనే.. తను ఏడిస్టే మా వాళ్లు చూడలేరు.. కాబట్టి ఏడవను అనడం చూసేవారిని కూడా ఎమోషన్ కు గురి చేస్తుంది. శోభ కూడా ఏడుస్తూ... నాకు ఇది కావాలి అంటుంది. అటు డాక్టర్ బాబు సైతం అదే పనిగా ఏడుస్తూ కూర్చున్నాడు.

మొత్తంగా ఈ టాస్క్ లోని ఎమోషన్ కు అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి ఆ కన్నీళ్ల తర్వాత కెప్టెన్సీ కంటెండర్ గా ఎవరు ఎంపికవుతారో కానీ.. ఆ టైమ్ కు ఇందులో ఎన్ని ఫేక్ ఎమోషన్స్ ఉన్నాయో కూడా తెలుస్తుందేమో..

Updated : 5 Oct 2023 1:36 PM IST
Tags:    
Next Story
Share it
Top