పార్టీ ప్రారంభించిన బిగ్ బాస్ సన్నీ.. ఓర్నీ నీ యేషాలో
సౌండ్ పార్టీ పరిస్థితి ఏమిటో?
X
రాజకీయ నాయకులను చూసి సినిమా వాళ్లకు కూడా ఈ మధ్య తోకలెక్కువయ్యాయి. ప్రచారం కోసం వింతవింత విన్యాసాలు చేస్తున్నారు. ఎంత వెరైటీగా ఉంటే అంత ఫోకస్ అవుతుందనే భ్రమలో ఉన్నారు. టీవీ సీరియళ్ల నటుడు, బిగ్ బాస్ టీవీ రియాలిటీ షో విజేత వీజే సన్నీ కూడా అలాంటి బాటే తొక్కాడు. టీవీని వదిలిసి చిన్నచితకా సినిమాలతో హీరోగా ముందుకొచ్చిన సన్నీని జనం పట్టించుకోలేదని వాటికి వచ్చిన స్పందన చూస్తే తెలుస్తుంది. అయినా సన్నీ వెనక్కి తగ్గకకుండా పార్టీ పెడతానని మరోసారి వార్తల్లోకి వాచ్చాడు. పార్టీ పెట్టడానికి ఏ అర్హతా అవసరం లేని కాలం కాబట్టి నిజంగానే పార్టీ పెడుతున్నాడేమోనని జనం అనుకున్నారు. కొందరు అంతా స్టంట్ అని కొట్టి పడేశారు. ఆ మాటే నిజం చేస్తూ సన్నీ ‘‘సౌండ్ పార్టీ’’ పేరుతో కొత్త సినిమా ప్రకటించాడు. ఈ చిత్రం పూర్తాయిపోయిందని కూడా తెలిపాడు.
ఈ సినిమా లోగోను సారథి స్టూడియోలో సినీ జర్నలిస్టుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. సౌండ్ పార్టీ గట్టిగా సౌండ్ చేస్తుందని ఆశిస్తున్నట్లు సన్నీ చెప్పాడు. ‘‘నేను పార్టీ పెట్టబోతున్నట్టు వదిలిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. మా దర్శకుడు సంజయ్ శేరీ సినిమాను చక్కగా పట్టాలెక్కించాడు’’ అని చెప్పాడు. పాతికకుపైగా స్క్రిప్టును అధ్యయనం చేశాకే ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నానని నిర్మాత రవి పోలిశెట్టి చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవుతున్నాయని ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేస్తామన్నారు. బిగ్ బాస్ టైటిల్ హవాతో జోరుమీదున్న సన్నీ నటించిన ‘సకల గుణాభిరామ’, ‘ATM’, ‘అన్‌స్టాపబుల్ - అన్‌లిమిటెడ్ ఫన్’ మూవీలు జనాన్ని ఆకట్టులోకపోయాయి.