నేను నీకంటే పెద్ద నటుడిని.. రైతు బిడ్డకు ఇచ్చిపడేసిన అమర్ దీప్
X
బిగ్ బాస్ సీజన్ 7 మంచి రసవత్తరంగా సాగుతోంది. రెండో వారం నామి నామినేషన్స్ ప్రాసెస్‌లో కంటెస్టెంట్లు కొట్టుకోవడమే ఒక్కటే తక్కువ. బిగ్ బాస్ ఇళ్లు పీకి పందిరి వేశారు. జనాలను ఎంటెర్టైన్ చేయడానికి బిగ్ బాస్‌కు వెళ్లారో లేక ఒకరిని ఒకరు దూషించుకోవడానికి వెళ్లారో అర్ధం కావడం లేదు. ఒక్కసారిగా ఇంటి సభ్యులందరు కలిసి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌పై విరుచుకుపడ్డారు. నేను రైతు బిడ్డ అని తరచుగా ప్రశాంత్ అంటుంటే అమర్ దీప్‌కు కాలి గట్టిగా ఇచ్చిపడేసాడు. "నువ్వు పదే పదే రైతు బిడ్డ.. రైతు బిడ్డ అని చెప్పకు. నీకు ఓ లక్ష ఇస్తే..మరో రైతుకి ఇస్తాను అని అంటావ్. కానీ, వారి స్థానంలో ఓ రిక్షా అతను, లారీ డ్రైవర్ ఉంటాడు.. వారికి మాత్రం డబ్బులు ఇస్తానని ఎందుకు చెప్పవ్ " అంటూ పూనకం వచ్చినట్లుగా ఓ రేంజ్లో ఊగిపోయాడు.
ఒక్కసారి అమర్ దీప్ ఇచ్చిపడేయడంతో ప్రశాంత్‌కు ఏం చేయాలో తెలియక..పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌లాగా గా భుజం ఎత్తాడు. దీంతో మరోసారి "భుజం దించు.. భుజం దించు నేను మాట్లాడుతున్నాను కదా" అంటూ అమర్దీప్ ఆవేశంతో ఊగిపోయాడు. ఈ లోపు అన్నా చలి పెడుతోంది అని ప్రశాంత్ అనగా ‘ఇప్పుడు నువ్వు అల్లూ అర్జున్‌లా భుజం ఎత్తావ్ కదా.. ఇదే బాడీ లాంగ్వేజ్‌తో అన్నా నేను బిగ్ బాస్‌కి వస్తా అని ఎందుకు చెప్పలేదురా".. అంటూ రైతు బిడ్డను ఓ బంతి ఆడుకున్నట్లు ఆడుకున్నాడు అమర్ దీప్.
" రైతుకు మాత్రమే కష్టం కాదు, నిజానికి బీటెక్ చదివినోడు పడే కష్టాలు నీకేం తెలుసు? మంచి చదువు చదివి జాబ్‌లు లేక ఊరికి వెళ్లి, ఏ ఉద్యోగం చేస్తున్నామో తెలియక తినేందుకు తిండి లేక చచ్చిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్లకి ఏం చెప్తావ్? నువ్వు నా దగ్గర యాక్ట్ చేయకు..నేను నీకంటే పెద్ద యాక్టర్‌ని అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయాడు అమర్ దీప్.