Home > సినిమా > బిగ్ బాస్ 7: అందర్నీ కలుపుకుపోతే సరిపోదు.. అసలైన మజా ఉండాలి

బిగ్ బాస్ 7: అందర్నీ కలుపుకుపోతే సరిపోదు.. అసలైన మజా ఉండాలి

బిగ్ బాస్ 7: అందర్నీ కలుపుకుపోతే సరిపోదు.. అసలైన మజా ఉండాలి
X

వీకెండ్ వచ్చేసింది. ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే తెలుగు ప్రేక్షకులు ఈ వారం బిగ్ బాస్ సీజన్ 7 కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఎలిమినేషన్ డే కాబట్టి.. ఈరోజు నుంచి హౌస్ అయ్యేది ఆ కంటెస్టెంటే నంటూ ముందుగానే ఊహాగానాలు చేస్తూ రెడీ అయ్యారు. ఈ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. ఆమె ఫర్ఫార్మెన్స్.., ప్రేక్షకుల నుంచి మద్దతు సరిగా లేకపోవడం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. మొదటి హౌస్ మేట్ గా సందీప్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడు. రెండో పవర్ అస్త్రాను సాధించి.. మరో హౌస్ మేట్ గా శివాజీ కూడా కన్ఫామ్ అయ్యాడు. ఇక ఈ ఆదివారం రోజున ఎలిమినేషన్ ఉండనుంది. సెకండ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్ నుంచి షకీలా వెళ్లిపోనుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఆమె అభిమానులకు మింగుడుపడడం లేదు. హౌస్ నుంచి షకిలా అప్పుడే వెళ్లిపోతే ఎలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి మిగిలిన కంటెస్టెంట్లలో కొందరికంటే.. షకీలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది. గేమ్ స్పిరిట్ చూపిస్తుంది. అందరితోనూ కలిసిపోయి ఉంటుంది. ఎవరికైనా గొడవలు వస్తే.. కలిపే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాన్ని నాగార్జున కూడా ప్రస్తావించాడు. మంచి పనిచేస్తున్నావ్ షకీ అమ్మా అంటూ మెచ్చుకున్నాడు. కానీ ఎలిమినేషన్లోకి వచ్చేసరికి పరిస్థితి వేరేలా ఉంది. ఆమెకు ప్రేక్షకుల నుంచి మద్దతు తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఆమె గేమ్‍లో ఇన్వాల్వ్ అవుతుంది కానీ.. ఎంటర్టైన్మెంట్ మాత్రం సరిగా ఇవ్వడం లేదని అనుకుంటున్నారట. షకీలా చాలా సాఫ్ట్ గా కనిపిస్తోంది. హౌస్‍లో అందరితో బాగానే ఉన్నా.. ఆటకు తగ్గట్టుగా లేదని అంటున్నారట మరికొంతమంది. రెండో వారంలో నామినేషన్ జాబితాలో 9 మంది ఉన్నారు. పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. అయితే ఇందులో శివాజీ పవర్ అస్త్రా సాధించి.. సేఫ్ అయ్యాడు. ఇక మిగిలిన వారిలో చివరి స్థానంలో షకీలా .. ఆమె కంటే ఒక స్థానం ముందు శోభా శెట్టి ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో షకీలాను ఎలిమినేట్ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Updated : 17 Sep 2023 4:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top