Bigg Boss 7 : బిగ్ బాస్ హౌస్‌లోకి కొత్త జంటలు..
X
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మొదలై అప్పుడే వారం కావొస్తుంది. చిత్ర విచిత్రమైన సంఘటలు.. ఊహకే అందని మలుపులు.. మొత్తంగా సరికొత్త కంటెంటెతో సాగుతూ ప్రేక్షకులకు మజాను అందిస్తోంది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో సాగుతున్న ఏడో సీజన్‌లో ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ చూడని కొత్త కొత్త టాస్కులు కూడా చూపిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌పై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. అంతే కాదు ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో నయా పద్ధతిని ఫాలో అవుతోంది బిగ్ బాస్.
ప్రస్తుతం హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. అయితే వారంత ఇంకా కన్ఫార్మ్ కాదని ఇప్పటికే నాగ్ తెలిపారు. బిగ్ బాస్ అందించే పవర్ అస్త్రం ఎవరైతే గెలుచుకుంటారో వారే కన్ఫార్మ్ అవుతారని చెప్పారు. దీంతో ఫస్ట్ నామినేషన్స్ లోనే ఆట మంచి రసవత్తరంగా మారింది. మొదటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 8 మంది హౌస్ నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడే బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్స్ షురూ అయ్యాయి, గాసిప్స్ తారాస్తాయికి చేరుకున్నాడు. కొత్త కొత్త గ్రూపులు రెడీ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈ వీకెండ్లో మరికొంత మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి రాబోతున్నారు. ఫేమస్ సెలబ్రెటీలతో పాటు ఓ స్టార్ నటి కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. వారెవరో కాదు హీరోయిన్ కౌషా, సీనియర్ నటి లైలా. వీరిద్దరూ హౌస్‌లోకి వెళ్లనున్నట్లుగా టాక్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. అంతే కాదు దేవత సీరియల్ ఫేమ్ అర్జున్ అంబటి, అందాల యాంకర్ వర్షిణి, పవన్ సాయి రాజ్ పుత్, క్రాంతి, నిఖిల్ విజయేంద్ర, పూజా మూర్తి, ఐశ్వర్య ఇలా పలువురు బిగ్ బాస్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.