Amardeep Bigg Boss: మాస్ ఫాలోయింగ్.. మీసం మెలేసిన అమర్‌దీప్..
X
వంద రోజులకుపైగా అలరించిన బిగ్‌బాస్-7 కంప్లీట్ అయిపోయింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఆ విషయం పక్కన పెడితే.. ఈ సీజన్లో మిగతా కంటెస్టంట్‌ల కంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చి రన్నరప్ గా నిలిచాడు అమర్‌దీప్. గ్రాండ్ ఫినాలే తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం.. అతనిపై కొంతమంది అల్లరిమూక దాడి చేశారు. దాడి నుంచి బయటపడ్డ అనంతరం.. ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్న అమర్‌దీప్ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడాడు.‘‘నాకేం కాదు.. నాకు మీరున్నారు. నిజంగానే నేను అనుకోలేదు ఇక్కడ వరకూ వస్తానని.. నన్ను ఇక్కడ వరకూ తెచ్చింది మీరే.. నా మాస్ ఫ్యాన్స్. మాస్ మహరాజా రవితేజా నా ఇన్స్పిరేషన్. నేను చచ్చే వరకూ ఒకటే మాట. సూటిగా మాట్లాడటం. నాకు తెలిసింది ఇదే.. ఏదైనా సూటిగా మాట్లాడతా.. అలానే మాట్లాడా.. అలానే ఉన్నా. కప్పు గెలవలేదని అస్సలు ఫీల్ కావడం లేదు.. మీ అందర్నీ గెలిచాను.. మీరంతా నాతో ఉన్నారు.. ఇంతకంటే నాకేం కావాలి? ఇది చాలు.
నాకు సపోర్ట్ చేసిన ఆడపడుచులందరికీ చేతులెత్తి మొక్కుతున్నా.. నాకు ఇది మరో జన్మ. నాకిది చాలు. మాస్ ఫాలోయింగ్ అనేది ఎవడికీ రాదు. వస్తే వాడు మగాడ్రా.. మీసం మెలేస్తున్నా. ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు.. గతం గతః బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక.. మన జీవితం, మన అవకాశాలు.. మన సినిమా. నాకు ఇదే ముఖ్యం. నాకు కావాల్సింది ఇదే’ అంటూ ఆవేశంగా ప్రసంగించాడు. తన కోసం వచ్చిన అభిమానులకు లేడీ ఫ్యాన్స్‌కి చేతులెత్తి మొక్కాడు. అనంతరం అభిమానులతో కలిసి కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. మాస్ రాజా రవితేజ మాస్ బీట్ సాంగ్స్‌కి అభిమానులతో కలిసి స్టెప్‌లు వేశాడు అమర్ దీప్. అతనితో పాటు అమర్ భార్య తేజస్విని గౌడ కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది.
అయితే అంతకు ముందు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌గా చెప్పుకునే కొన్ని అల్లరిమూకలు అమర్ దీప్‌పైన అతని ఫ్యామిలీపైన దాడి చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తుండగా.. ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ కారుపై దాడి చేశారు. అప్పటికి కారులో అమర్ దీప్‌తో పాటు.. అతని తల్లి, భార్య, స్నేహితుడు నరేష్‌లు ఉన్నారు. ఒక్కసారిగా అల్లరి మూకలు దాడి చేయడంతో భయాందోళలనకు గురయ్యారు. అమర్ దీప్‌ని దారుణంగా బూతులు తిడుతూ.. దాడికి పాల్పడ్డారు. కారులో ఆడవాళ్లు ఉన్నారనే ఇంగితం లేకుండా జంతువుల్లా ప్రవర్తించారు. అమర్ దీప్ కారునే కాకుండా.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కారుల్ని కూడా ధ్వంసం చేశారు. ఇక రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌కు మనీ కూడా ఏమీ లభించలేదు. ఒట్టి చేతులతోనే స్టేజ్ వీడాల్సి వచ్చింది.