Bigg Boss 7 Telugu: 'గుండు' త్యాగం చేయలేని అమర్‌దీప్.. ప్రియాంకనే బెటర్
X
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్.. రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకూ రతిక-ప్రశాంత్‌ల జోడీ పెర్ఫార్మెన్స్‌తో .. బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు మంచి ఎంటర్టైన్మంట్ దొరికింది. ఇక ఈ రోజు అమర్ దీప్, ప్రియాంక జైన్‌ల అసలు టాస్క్ ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మూడోవారం పవరాస్త్ర ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే అమర్ దీప్‌ని పవరాస్త్రకి అనర్హుడిగా ప్రకటించింది ప్రియాంక. అయితే వీళ్లిద్దరి మధ్య ఫిటింగ్ పెట్టారు బిగ్ బాస్. పవరాస్త్ర పోటీదారులుగా నిలవాలంటే.. ఇద్దరిలో ఒకరు జుట్టుని త్యాగం చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ బాంబ్ పేల్చారు. దీంతో అమర్ దీప్ ఒక్కసారిగా నోరెళ్లబెట్టాడు. అయితే అమర్ దీప్‌కి గుండుకొట్టించుకోవాలి.. ప్రియాంక అయితే మెడ వరకూ కత్తిరించుకోవాలని.. ఆ లుక్ ఎలా ఉండాలో కూడా హౌస్‌కి ఫొటోలు పంపారు బిగ్ బాస్.
ఈ టాస్కులో ఎవరు ఉంటారు.. ఎవరు గివప్ ఇస్తారో తేల్చుకోమన్నాడు బిగ్ బాస్. అయితే, గుండు అనేసరికి అమర్ దీప్ తన వల్ల కాదని అన్నాడు. తన తలపై కుట్లు పడ్డాయని, గుండు చేయించుకుంటే కనిపిస్తుందని, అది అంతా బాగొదని చెప్పాడు. అలాగే నేను రవితేజకు అభిమాని అని తెలుసుగా. ఆయన నా జుట్టుపై చేయి వేసి.. నాలాగే ఉందని అన్నారు అని టేస్టీ తేజాతో అన్నాడు అమర్ దీప్. అప్పుడు తేజా వేసిన పంచ్ అయితే పేలిపోయింది. ‘ఉంది అన్నారు లేవయ్యా.. నీ జుట్టు నీకే వస్తుంది కదా..కాకపోతే టైం పట్టుద్ది ’ అని అన్నాడు. దానికి అక్కడే ఉన్న ప్రియాంక నవ్వుతూ కనిపించింది.
రకరకలా కారణాలు చెప్పి అమర్ దీప్ చేతులెత్తేసాడు. ఇక ప్రియాంక జుట్టు కత్తిరించుకోవడానికి ముందు ఓకే అని.. తర్వాత అమర్ దీప్ లేడుగా అని, మళ్లీ అమ్మాయిలకు ఇలాంటి హెయిర్ కట్ అంటే మాములు విషయం కాదు కదా అంటూ రకరకాల మాటలు చెప్పింది. కానీ, ఫైనల్‍గా మాత్రం జుట్టు కత్తిరించుకోడానికి రెడీ అయింది. . ప్రతి సీజన్‌లో లాగే.. ఈ సీజన్‌లో జుట్టు కత్తిరించుకునే కార్యక్రమానికి బలి కాబోతున్నది ప్రియాంక. ఫస్ట్ సీజన్‌లో ఈ కత్తిరింపు కార్యక్రమం లేదు కానీ.. రెండో సీజన్‌లో దీప్తి సునైనా, మూడో సీజన్‌లో శివజ్యోతి, నాలుగో సీజన్‌లో హారిక, ఆరో సీజన్‌లో వాసంతిలు జుట్టు కత్తిరించుకునే కార్యక్రమంలోని కంటెస్టెంట్స్. ఈ సీజన్‌లో ప్రియాంక జైన్.. జుట్టుని త్యాగం చేయబోతుంది. కాబట్టి పవరాస్త్ర కాంపిటేషన్ నుంచి అమర్ దీప్ ఔట్.. ప్రియాంక ఇన్ అన్నమాట.