Bigg Boss 7 : "చుప్.. మూసుకోని కూర్చోబే"...నామినేషన్స్‌లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్
X
బిగ్‌బాస్‌లో ఈ వీక్ నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈ వారం కాస్త కొత్తగా నామినేషన్స్‌ను బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. కంటెస్టెంట్లకు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరు చొప్పున తోటి కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నామినేట్ అయిన కంటెస్టెంట్‌ను మనోసారి నామినేట్ చేసే వీలు లేదు. అందులోనూ ఒక్కో సభ్యుడు ఎన్నుకున్న ఇద్దరిలో ఎవరి నామినేషన్‌తో జ్యూరీ మెంబర్స్ కన్వీన్స్ అవుతారో వారికి మాత్రమే నామినేటెడ్ అనే గిల్టీ బోర్డ్‌ను వేస్తారు. జ్యూరీ మెంబర్స్‌గా అల్రెడీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా కన్ఫర్మ్ అయిన హౌస్మేట్స్ ఉంటారు. ఈ కొత్త నామినేషన్ ప్రక్రియ గరం గరంగా సాగింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట్లో హీట్ పెంచుతోంది.
బిగ్‌బాస్ ప్రోమోలో ముందుగా శుభశ్రీ ఇద్దరిని నామినేట్ చేసింది. రతిక రోజ్, అమర్ దీప్‌ను నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. రతిక నాగార్జున ముందు కావాలనే తన మాజీ లవర్ గుర్తుకువస్తున్నాడంటూ చెబుతుందని, రతిక కావాలనే ఇలా చేస్తోందని శుభశ్రీ హౌజ్‌లో వాదించింది. ఈ విషయంలో శుభశ్రీకి రతిక ఘాటుగా రిప్లై ఇచ్చిపడేసింది. నేనెవరితోనే మాట్లాడిన విషయాలు ఇలా చెబుతోంది, నీ క్యారెక్టర్ అంటూ శుభశ్రీపై రతిక ఫైర్ అయ్యింది. దీంతో నోరు కంట్రోల్లో పెట్టుకో అంటూ శుభశ్రీ రతికకు వార్నింగ్ ఇచ్చింది.
ఇక అమర్ ఇంట్లో పనులు చేయడం లేదని నామినేట్ చేసింది శుభశ్రీ. దీనికి కౌంటర్‌గా అమర్ నువ్వు చేసిందేమీ లేదు రోటీలు తప్పా అంటూ గట్టిగా ఇచ్చేశాడు. శుభశ్రీ రోటీస్ సెంటర్ అంటూ బోర్డు పెట్టుకో అని డైలాగులు పేల్చాడు. మీరందరూ హౌస్ నుంచి వెళ్లిపోయినా నేను ఇక్కడే ఉంటానంటూ అమర్ ఓవర్ కాన్ఫిడెన్స్‌ని బయటపెట్టాడు.
ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో గౌతమ్, ప్రిన్స్ యావర్‌ను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వేడి వేడిగా చర్చ నడిచింది. తూ క్యారే అంటూ నా మీదకి వచ్చాడు యావర్ అంటూ గౌతమ్ ప్రోమోలో చెబుతాడు. దీనికి అవును నేను అలాగే అంటాను అది నా ఆటిట్యూడ్ అంటూ బిల్డప్ ఇచ్చాడు. యావర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో గౌతమ్ కూడా రెచ్చిపోయాడు. చుప్ బే అంటూ ప్రిన్స్ అనడంతో మూసుకొని కూర్చో బే అంటూ గౌతమ్ తిట్టాడు. దీంతో ఒకరిని ఒకరు బీభత్సంగా తిట్టుకున్నారు. బోన్ నుంచి ప్రిన్స్ గౌతమ్ మీదకి దూసుకొచ్చాడు. ఒక లెవెల్లో ఇద్దరూ కొట్టుకుంటారేమో అని అనిపిస్తుంది. వెంటనే శివాజీ ఎంటర్ అయ్యి ప్రిన్స్ పైన అరిచాడు. ఇది నీ ప్లేస్ కాదు అంటూ గట్టిగా అరవడంతో ప్రిన్స్ బోన్లోకి వెళ్లిపోయాడు. ప్రోమోను బట్టి ఈ వీక్ నామినేషన్స్ ఫుల్ హీటెక్కించేలా ఉంటుందని అర్థమవుతోంది.