Home > సినిమా > Bigg Boss 7 Telugu: చేతులు మారిన బిగ్​ బాస్​ టైటిల్ - విన్నర్ అతడే!

Bigg Boss 7 Telugu: చేతులు మారిన బిగ్​ బాస్​ టైటిల్ - విన్నర్ అతడే!

Bigg Boss 7 Telugu: చేతులు మారిన బిగ్​ బాస్​ టైటిల్ - విన్నర్ అతడే!
X

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షో క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా ఫినాలేకు శివాజీ, అమర్, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక, అర్జున్ నిలిచారు. అయితే ఈరోజు సాయంత్రం 7 గంటలతో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కానుంది. బిగ్‌బాస్-7 విన్నర్ ఎవరు అవుతారో అని ప్రేక్షకుల్లో ఆసక్తి ఎంతగానో ఉంది. ఎందుకంటే.. అన్ని సీజన్ల మాదిరిలా కాకుండా.. ఈ సీజన్ ఉల్టా పుల్టా అని మొదటి నుంచి హోస్ట్ నాగార్జున గుర్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి అన్ని ఎపిసోడ్‌లు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

తాజాగా, ఫినాలేకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్, నాగార్జునతో కలిపి ఆరుగురు హీరోలు స్టేజ్‌పై సందడి చేశారు. మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి విడుదల కానున్న తన ఈగల్ చిత్రాన్ని బిగ్‌బాస్-7 ఫినాలేలో ప్రమోట్ చేసేందుకు వచ్చారు. అలాగే నా సామి రంగలో కీలక పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్, రాజ్ తరుణ్, హీరోయిన్ అషికా రంగనాథ్ వచ్చారు. మరో స్టార్ హీరో కల్యాణ్ రామ్ డెవిల్ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాడు. అలాగే సంయుక్త మీనన్ కూడా సందడి చేసింది. నిధి అగర్వాల్, నేహా శెట్టి తమ డ్యాన్స్‌లతో స్టేజ్‌పై దుమ్మురేపారు. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి పాటలో మెరిసిన చంద్రిక రవి సైతం డాన్స్ ఇరగదీసింది.

ఇదిలా ఉంటే తాజాగా, అందుతున్న సమాచారం ప్రకారం బిగ్‌బిస్ విన్నర్‌గా "రైతుబిడ్డ"గా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ నిలిచినట్లు సమాచారం. టాప్-3లో ఉన్న శివాజీ, ప్రశాంత్, అమర్ మధ్య గట్టిపోటీ సాగినప్పటికీ.. అమర్ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. దీంతో.. టైటిల్​ కోసం శివాజీ-ప్రశాంత్ మధ్య యుద్ధం సాగిందని టాక్. ఈ క్రమంలో.. శివాజీ విన్నర్ అని అంతా భావించినప్పటికీ.. ఆఖరులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఫైనల్ డ్రామాలో శివాజీ సెకండ్​ ప్లేస్​లో నిలిచాడని తెలుస్తోంది. ఇక బిగ్‌బాస్ విన్నర్ ఎవరో ఇప్పటికే సోషల్ మీడియాలో పలు పోస్టుల ద్వారా తెలిసిపోయింది. బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ ఆట సందీప్ భార్య జ్యోతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో... ‘‘హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. ఆ దేవుడు నిన్న చల్లగా చూడాలి తమ్ముడు. స్పై ఫ్యాన్స్ 8.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చేయండి’’ అంటూ పల్లవి ప్రశాంత్ గురించి ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది . దీంతో విన్నర్ ఎవరో ముందుగానే చర్చించి కన్ఫామ్ కావడం వల్లే ఈ పోస్ట్ పెట్టిందని అందరూ అనుకుంటున్నారు.

బిగ్​ బాస్​7వ సీజన్​ గ్రాండ్​ ఫినాలేకు ముందు నుంచీ ప్రచారంలో ఉన్నట్టుగానే.. టాలీవుడ్ సూపర్ స్టార్​ మహేష్ బాబు విజేత పేరును ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మాజీ కంటిస్టెంట్ల చప్పట్ల మధ్య.. విన్నర్ ప్రశాంత్ ​కు ట్రోఫీ బహూకరించినట్టు సమాచారం.




Updated : 17 Dec 2023 8:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top