Bigboss Winner : 'సీఎం పదవి ఇస్తే..' ఒక్క ఛాన్స్ కావాలంటున్న పల్లవి ప్రశాంత్
X
బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. హౌస్‌లోకి కామన్ మ్యాన్‌గా ఎంటరైన ఓ వ్యక్తి టైటిల్ గెలుచుకున్నాడు. ఈ గెలుపు ఓ రైతుబిడ్డ సాధించిన విజయంగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా నిన్నటివరకే. షో లో ఎంతో మర్యాదగా, పద్దతిగా కనిపించిన ఈ విజేత.. ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చినట్లుంది. హౌస్ నుంచి బయటికొచ్చాక సీన్ రివర్స్ అయింది. టైటిల్ గెలిచిన తర్వాత ప్రశాంత్ కాళ్లు భూమి మీద లేవు. గాల్లో తేలుతున్నాడు. షోలోకి వెళ్లడం కోసం.. 'అన్నా.. మల్లొచ్చినా..', 'అన్నా.. నాకు బిగ్‌బాస్‌లో ఛాన్స్ ఇవ్వండన్నా' యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చి తనకు సపోర్ట్ చేయమన్న రైతుబిడ్డ... ఇప్పుడు కప్పుతో వచ్చిన తర్వాత యూట్యూబ్ యాంకర్లను అస్సలు పట్టించుకోవడం లేదట. అంతే కాదు ఇంటర్వ్యూ అడిగితే కూడా చాలా దురుసుగా, చులకన చేసి మాట్లాడుతున్నాడట.
ఒక్క ఇంటర్వ్యూ అని అడిగితే.. 'మీరు మా పొలం దగ్గరకు రండి.. పనులు చేయండి.. వీడియో తీసుకోండి. మీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి రైతులకు ఏమిస్తారో చెప్పుర్రి. ఆ తర్వాతే మీకు ఇంటర్వ్యూలు ఇస్తా..' అంటూ అతి చేస్తూ మాట్లాడాడు. "మీ సమీపంలోనే మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ఉంది, మీరు రైతుగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోయిన దాదాపు 14 గ్రామాల రైతులకు గతంలో ఏమైనా సాయం చేశారా? వారికి మద్ధతుగా నిలిచారా?" అని ఓ టీవీ ఛానెల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు వెటకారంగా బదులిచ్చాడు. 'నాకేమైనా సీఎం పదివి ఇచ్చిర్రా? ఏదైనా చేయడానికి! నేను ఒక రైతుబిడ్డను కదా.. సీఎం చేస్తరా చెప్పుండ్రి.. అందరినీ ఆదుకుంటా.. నేనేమైనా నాయకుడినా? నేనూ ఒక రైతుబిడ్డనే.. నేనేం చేస్తా' అని వెకిలిగా నవ్వుతూ సమాధానమిచ్చాడు.