Bigg Boss 7 Buzz: అర్ధరాత్రి మళ్లీ మొదలుపెట్టిన రతిక-ప్రశాంత్
X
బిగ్ బాస్ రియాల్టీ షో ప్రతీ సీజన్‌లో కచ్చితంగా ఓ లవ్ ట్రాక్ నడిచేది. కానీ సీజన్ 7 లో మాత్రం ఇప్పటివరకైతే ఒక్క ప్రేమ కథ కూడా మొదలుకాలేదు. అయితే పల్లవి ప్రశాంత్, రతిక ల మధ్య ఏదో నడుస్తోంది అనుకున్నారు మొదట్లో ప్రేక్షకులు. అయితే నామినేషన్స్‌లో రతిక.. ప్రశాంత్ కు వ్యతిరేకంగా మాట్లాడడంతో వారిద్దరి మధ్య మాటలు కూడా ఆగిపోయాయి. అయితే మళ్లీ ఇన్ని రోజుల తర్వాత రతిక, ప్రశాంత్ సరదాగా మాట్లాడుకున్నారు. ఆ వీడియోను.. బిగ్ బాస్ బజ్‌లో లీక్ చేశారు.
తాజాగా విడుదల చేసిన వీడియోలో ప్రశాంత్, రతికలు కాస్త సన్నిహితంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ.. పక్కన ఎవరు లేని సమయంలో.. బెడ్ రూమ్‌లో రతిక పడుకొని ఉండగా.. గ్లాస్‌కు అటువైపుగా ప్రశాంత్ కూర్చొని ఉన్నాడు. ‘‘కొంచెం ముందుకు రా’’ అని ప్రశాంత్ అడగడంతో ఈ బిగ్ బాస్ బజ్ ప్రోమో మొదలయ్యింది. ‘‘డ్యాన్స్ రాదని బాగానే డ్యాన్స్ చేశావు’’ అంటూ రతిక.. ప్రశాంత్‌ను పొగిడింది. దానికి ప్రశాంత్ సరదాగా డిస్కో డ్యాన్సర్ అంటూ పాట పాడాడు. ఫ్లోర్ మూమెంట్ అంటూ కామెడీ చేశాడు. ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నారు, సరదాగా చేతులతో ఆడుకున్నారు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకున్నారు.
నిజానికి బిగ్ బాస్ లాంచ్ అయి.. అందరూ ఇంట్లోకి వచ్చాక.. రతికను లేడీ లక్ అని చెప్పాడు ప్రశాంత్. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ సరదాగా ఉన్నారు. ప్రశాంత్ అయితే.. రతిక ఎక్కడ ఉంటే.. అక్కడే ఉండేవాడు. ఇతర కంటెస్టెంట్స్ కూడా వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని ఫిక్స్ అయిపోయారు. అంతలా కనెక్ట్ అయినట్టుగా అనిపించింది. నామినేషన్స్ లో కూడా ఈ కారణం చెప్పినట్టుగా ఉన్నారు. కానీ తర్వాత మాత్రం రతిక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ వీళ్లద్దరూ సరదాగా మాట్లాడుకోవడం చూసిన బిగ్ బాస్ ప్రేక్షకులు.. వీరి మధ్య ఇంకేదో ఉందని అనుకోవడం మొదలుపెట్టారు.