Home > సినిమా > Bigg Boss Buzzz: కంటెస్టంట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన షకీలా

Bigg Boss Buzzz: కంటెస్టంట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన షకీలా

Bigg Boss Buzzz: కంటెస్టంట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన షకీలా
X

బిగ్‌ బాస్‌-7వ సీజన్‌ సెకండ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా.. నటి షకీలా హౌస్ నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. టాస్క్‌లో చురుకుతనం చూపించకపోవడం, బుల్లితెర ప్రేక్షకుల్లో పెద్దగా ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయకపోవడంతో ఆమెకు ఓట్లు చాలా తక్కువగా వచ్చాయి. దాంతో బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ.. ‘ఇంత త్వరగా హౌస్‌ నుంచి బయటకు వచ్చేస్తానని అనుకోలేదు’ అని అన్నారు. ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌లో ఎవరెవరు ఎలాంటి వారో చెప్పమని రెయిన్‌బో కలర్స్‌ను ఇవ్వగా షకీలా ఆ వ్యక్తి ఫొటోపై పెయింట్‌ వేస్తూ, వాళ్ల మనస్తత్వాన్ని చెప్పారు. ‘‘ప్రియాంక.. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రిన్స్‌ యావర్‌.. ఎప్పుడూ తానే గొప్పవాడు అనుకుంటాడు. పల్లవి ప్రశాంత్‌.. ఆవేశ పరుడు. ఎవరి మాట వినడు. తొందర పడిపోతాడు. దామిని.. నమ్మకస్తురాలు. రతికా రోజ్‌.. హృదయం బండరాయిలాంటిది. శివాజీ.. ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు’ అంటూ షకీలా హౌస్‌మేట్స్‌కు కితాబిచ్చారు. అనంతరం ఇంట్లోని వాళ్లందరూ షకీలాకు వీడ్కోలు చెబుతూ భావోద్వేగానికి గురైయ్యారు.

ఇక తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ బజ్ ప్రోమోలో.. తన హౌస్‌మేట్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ ప్రోమోలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సుత్తి లేకుండా సూటిగా సమాధానమిచ్చారు షకీలా. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కొందరి కంటెస్టంట్ల ప్రవర్తన గురించి చెబుతూ ఆ సీక్రెట్స్ అన్ని బయటపెట్టారు. ఏ గోల్ లేకుండానే హౌస్ లోకి ఎంటర్ అయ్యానని.. వచ్చాక కూడా ఎలాంటి ప్లాన్‌లు వేయకుండానే అందరితో కలివిడిగా ఉన్నానని చెప్పిన షకీలా.. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, రతిక ల గురించి హాట్ కామెంట్స్ చేశారు. జస్ట్ బాడీని పెట్టుకొని ప్రిన్స్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటాడని.. పల్లవి ప్రశాంత్ ది బ్లడీ రాంగ్ ఆటీట్యూడ్ అని అన్నారు. ఇక రతికను ఓ అందమైన పాముతో పోల్చగా.. శివాజీ ఓ మంచి బ్రదర్ అన్నారు.




Updated : 18 Sept 2023 6:37 PM IST
Tags:    
Next Story
Share it
Top