Bigg boss season7: ఆ సింగర్తో బ్రేకప్.. ఇప్పుడు రైతు బిడ్డతో లవ్ ట్రాక్!
X
బిగ్ బాస్ సీజన్-7.. తొలివారం నుంచే ఆకట్టుకునే రీతిలో సాగుతుంది. గతంలో ఒకటి రెండు వారాలు గడిచాక.. హౌజ్ లో ప్రేమ కథలు మొదలయ్యేవి. కానీ, ఈ సీజన్ లో తొలివారమే ప్రేమ వ్యవహారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం రతిక, పల్లవి ప్రశాంత్ మధ్య ఓ రేంజ్ లో ప్రేమ వికసించింది. వీరి ప్రేమకు బిగ్ బాస్ కూడా సాయం చేస్తున్నాడు. తాజాగా బిగ్ బాస్.. ప్రశాంత్ గుండె ఏమని కొట్టుకుంటుందో చెక్ చేయమని రతికను ఆదేశించాడు. స్టెతస్ స్కోప్ ని ప్రశాంత్ గుండెపై పెట్టిన రతిక.. తన పేరు వినిపిస్తుందని చెప్పి షాకిచ్చింది. ఆ తర్వాత ‘ప్రశాంత్ గుండె కొట్టుకోవట్లేదు. అతని గుండె నా దగ్గర ఉంది’ అంటూ ప్రేమలో పరవశించింది పోయింది.
బిగ్ బాస్ హౌజ్ లో ఈ వ్యవహారం నడుస్తుంటే.. రతిక నిజమైన లవర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది. అది కూడా బిగ్ బాస్ ఇవ్వడం గమనార్హం. రతిక బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చినప్పుడే ‘హార్ట్ బ్రేక్ నుంచి బయటకు వచ్చేశావా’ అని నాగార్జున అడిగాడు. అంతేకాక ‘నీ హార్ట్ బ్రేక్ చేసిన వాడిని ఇమిటేట్ చేయ్’ అని కూడా అడిగాడు. అప్పుడు రతిక.. పాట పాడాలా.. అని అడిగింది. దానిని బట్టి ఆమె సింగర్ తో ప్రేమలో ఉన్నట్లు స్పష్టమయింది. కాగా, తాజాగా ఆ సింగర్ ఎవరో కూడా తేలిపోయింది. బిగ్ బాస్ రతిక కోసం ‘భూలోకం దాదాపు కన్నూమూయు వేళా’ అనే పాటను ప్లే చేశాడు.
ఆ పాట బిగ్ బాస్ హౌజ్ లో గతంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. దీనిని బట్టి రతిక లవర్ రాహుల్ సిప్లిగంజ్ అని ఆడియెన్స్ క్లారిటీకి వచ్చేశారు. అయితే ఇప్పుడు రతిక-రాహుల్ సిప్లిగంజ్‌లు బ్రేకప్ చెప్పుకున్నారని, వాళ్ల మధ్య గ్యాప్ కి కారణం బిగ్ బాస్ అనే ప్రచారం నడుస్తుంది. రాహుల్ బిగ్ బాస్‌కి రావడం వల్లే రతికతో విడిపోయిందని చెప్తున్నారు. ఇక ఇప్పుడు హౌజ్ లో రతిక ప్రశాంత్ తో ప్రేమ కహానీ నడుపుతుంది. మరి ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి.