Home > సినిమా > Bigg Boss beauty: బిగ్‌బాస్ బ్యూటీ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు

Bigg Boss beauty: బిగ్‌బాస్ బ్యూటీ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు

వేణు స్వామితో సినీ నటి ప్రత్యేక పూజలు

Bigg Boss beauty: బిగ్‌బాస్ బ్యూటీ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు
X

Bigg Boss beauty: బిగ్‌బాస్ బ్యూటీ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు


సినీ నటులు, సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, సినీ తారల చేత ప్రత్యేక పూజలు చేయిస్తూ.. ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామి(Venu Swamy) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటివరకూ రష్మిక మందన్నా, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి తదితర తారలంతా వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా.. కూడా వేణుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి(Ashu Reddy)కూడా.. తన ఇంట్లో వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. పూజల అనంతరం వేణుస్వామి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకుంది. ఈ వీడియోకు ‘ఇది పూజ టైం.. డివైన్ టైం’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టింది. అలాగే ఎవరి నమ్మకాలు వాళ్లవి బ్రో అని మరో హ్యాష్ ట్యాగ్ కూడా జత చేసింది.

https://www.instagram.com/reel/C3FZDFhp85C/?utm_source=ig_web_copy_link

ప్రస్తుతం అషూ రెడ్డి షేర్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే ఈ వీడియోకి కామెంట్‌ సెక్షన్‌ ను డిసెబుల్‌ చేసింది. కాగా వేణు స్వామితో అషు రెడ్డి పూజలు చేయించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కొత్త కారు కొన్నప్పుడు కూడా ఇలాగే ఈ జ్యోతిష్కుడితో ప్రత్యేక పూజలు చేయించింది. మళ్లీ ఇప్పుడు పూజలు చేయించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. టిక్‌ టాక్‌ వీడియోలతో బాగా క్రేజ్‌ తెచ్చుకున్న అషూ రెడ్డి కొన్ని టీవీ షోలతో బాగా పాపులర్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 కంటెస్టెంట్‌ గా మరింత గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లోనూ నటించినా పెద్దగా క్లిక్ కాలేకపోయింది.



Updated : 9 Feb 2024 9:39 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top