Home > సినిమా > హాస్ పార్టీకి ప్లాన్ చేస్తే.. రేవ్ పార్టీ అని ప్రచారం చేశారు

హాస్ పార్టీకి ప్లాన్ చేస్తే.. రేవ్ పార్టీ అని ప్రచారం చేశారు

హాస్ పార్టీకి ప్లాన్ చేస్తే.. రేవ్ పార్టీ అని ప్రచారం చేశారు
X

నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో రేవ్ పార్టీని హైదరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు భాగం చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 మంది సెలబ్రిటీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిమజ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వార్తలన్నీ అవాస్తవం అని చెబుతూ తాను తన నివాసంలో దీపావళికి హౌస్ పార్టీ ప్లాన్ చేసుకున్నానని చెప్పారు. తాను కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి దీపావళి కావడంతో బంధువులను మిత్రులను పిలిచి ఒక మంచి పార్టీ చేసుకున్న సమయంలో ఎవరో తెలియని వారు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు.

ఆ సమాచారంతోనే పోలీసులు తన ఇంటికి వచ్చారని.. ఏం జరుగుతోందని ప్రశ్నించి ఏమైనా చట్ట విరుద్ధంగా జరుగుతుందా లేదా అని చెక్ చేసి వెళ్లారని చెప్పుకొచ్చారు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని ఎలక్షన్స్ టైం కాబట్టి ఏమైనా తప్పుగా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో వచ్చి చెక్ చేశారని తెలిపారు. కానీ ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు జరగడం లేదని తెలుసుకుని వెళ్లిపోయారని హిమజ అన్నారు. అయితే మీడియాలో రేవ్ పార్టీ భగ్నం చేసి తనను అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని, అది ఎంత మాత్రం నిజం కాదని అన్నారు. ఆ వార్తలు చూసి చాలా మంది భయపడి తనకి కాల్స్ చేస్తున్నారని, వారందరికీ సమాధానం చెప్పలేక ఇలా ఒక వీడియో చేసి పెడితే అందరికీ ఒక క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది అని వీడియో చేస్తున్నట్లుగా తెలిపారు. పోలీసులు వచ్చారు, చెక్ చేసుకున్నారు, వెళ్లిపోయారు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. మరి ఈ సమాచారం పోలీసులకు ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారో? నాకు తెలియదు కానీ అది రకరకాలుగా మీడియా వరకు వెళ్లిందని ఆమె చెప్పుకొచ్చారు

Updated : 12 Nov 2023 2:46 PM IST
Tags:    
Next Story
Share it
Top