Bigg Boss 17 winner: బిగ్బాస్ 17 విన్నర్ మునావర్ ఫారుఖీ ఎంత గెలిచాడో తెలుసా?
X
బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్ గా ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ నిలిచారు. బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ రియాల్టీ షో ఆదివారం ముగిసింది. 107 రోజుల పాటు కొనసాగిన ఈ సీజన్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. కాగా ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన మునావర్ గెలిచాడు. విజేతగా నిలిచిన మునావర్ కార, రూ.50 లక్షల నగదు అందుకున్నాడు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని మునావర్ చెప్పుకొచ్చాడు. తనకు ఓటేసి గెలిపించిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు.
నటుడు అభిషేక్ కుమార్ రన్నరప్ గా నిలిచాడు. ఫైనల్లో అభిషేక్ కుమార్, మునావర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫైనల్స్ లో అడుగుపెట్టిన అంకిత టైటిల్ గెలుస్తుందంని అంతా అనుకున్నా.. అనుకోని విధంగా ఎలిమినేట్ అయింది. మొదటి నుంచి ఆడియన్స్ ను అలరించిన మునావర్.. చివరికి కప్పు గెలుచుకున్నాడు. కాగా స్టాండప్ కమెడియన్ అయిన మునావర్.. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు. గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన మునావర్ షోను.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అందుకు రాజాసింగ్ ను అప్పటి ప్రభుత్వం అరెస్ట్ అయ్యారు. ఆ ఘటన వివాదాస్పదం అవడంతో.. తర్వాత రాజాసింగ్ ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు.