Bigg Boss 7: ‘నువ్ హీరో అయితే.. నేను విలన్గా మారుతా’..అప్పుడే ఫిట్టింగ్స్ మొదలయ్యాయి
X
కాస్త లేట్ అయినా.. ఇప్పుడే మొదలయింది. తొలి వారాల్లో కాస్త చప్పగా సాగిన బిగ్ బాస్.. ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ రెచ్చింపోతున్నారు. ఆడియన్స్ కు కావాల్సిన అసలైన బిగ్ బాస్ మజాను అందిస్తున్నారు. కంటెస్టెంట్స్ ల హై టెంపర్ కు.. బిగ్ బాస్ ఫిట్టింగ్స్ తోడవడంతో హౌస్ అల్లకల్లోలంగా మారింది. కంటెస్టెంట్స్ అంతా కలిసి ప్రిన్స్ యావర్ కు నరకం చూపించగా, శోభాశెట్టి బీభత్సం సృష్టించింది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోల్లో ఏం ఉందంటే..?
రతిక రూటు మార్చింది. ప్రిన్స్ యావర్ తో ట్రాక్ మొదలుపెట్టింది. మూడో పవరస్త్ర కోసం బిగ్ బాస్.. అమరదీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ ను ఎంపిక చేశాడు. వీళ్లలో ఎవరు అనర్హులో చెప్పాలని కంటెస్టెంట్స్ ను కోరాడు. వీళ్లలో ఓ ముగ్గురు యావర్ పేరు చెప్పారు. దీంతో రతిక తనకు వెన్నుపోటు పొడిచిందని గ్రహించాడు యావర్. ఆ తర్వాత కాస్త డల్ గా కనిపించినా.. రతిక, యావర్ కలిసి ఒకే ప్లేట్ లో అన్నం తిన్నారు. దీంతో కొత్త ట్రాక్ మొదలయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక మూడో పవరస్త్ర పోటీ ఉండటంతో బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఓ బల్లపై ముఖం పెట్టాలని, ఎవరెంత ఇబ్బంది పెట్టినా బల్లపై నుంచి ముఖం తీయకూడదని కండీషన్ పెట్టాడు. దీంతో యావర్ ముఖంపై గుడ్లు పగలగొట్టి, ఒళ్లంతా పేడ పూసి, ఇన్నర్స్ లో ఐస్ లు వేసి నరకం చూపించారు.
మరోవైపు గౌతమ్.. తనను అనర్హురాలని చెప్పడాన్ని శోభా జీర్ణించుకోలేకపోయింది. గౌతమ్ పై అరుస్తూ రచ్చ చేసింది. ఈ క్రమంలో గౌతమ్ బాడీ గురించి శోభ కామెంట్స్ చేయడాన్ని తీసుకోలేకపోయాడు. ఈ ఇద్దరి మధ్య హీటింగ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ వ్యవహారంలో చివరికి ఏమైందని తెలియాలంటే ఇవాళ టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో చూడాలి.