Home > సినిమా > Bigg Boss Season 7: మాజీ ప్రియుడి ఆలోచనల్లోనే రతిక.. గట్టి క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss Season 7: మాజీ ప్రియుడి ఆలోచనల్లోనే రతిక.. గట్టి క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss Season 7: మాజీ ప్రియుడి ఆలోచనల్లోనే రతిక.. గట్టి క్లాస్ పీకిన నాగార్జున
X

బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఎలిమినేషన్‌కి రెడీ అయింది. ఇప్పటికే రెండు వారాలు కంప్లీట్ కాగా మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఈ మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోనూ బాగానే పెరిగింది. ఈ ఆదివారం కూడా లేడీ కంటెస్టంటే ఎలిమినేట్ అవుతారని టాక్ నడుస్తోంది.

ఇక శనివారం ఎపిసోడ్‌లో నాగ్‌ చాలా మంది కంటెస్టెంట్లపై ఫైర్‌ అయ్యాడు. వాళ్లు ఆడుతున్న ఆట తీరు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశాడు. వారిలో టేస్టీ తేజ, అమర్‌ దీప్‌, రతికలు ప్రధానంగా ఉన్నారు. వీరితోపాటు శుభ శ్రీ, ప్రశాంత్ లు కూడా పెద్దగా ఆడటం లేదని మండిపడ్డాడు. సందీప్‌ని అయితే ఉతికి ఆరేశాడు. న్యాయం చెప్పే సంచాలక్ ప్లేస్‌లో ఉన్న సందీప్ పార్షియాలిటీగా వ్యవహరించడంపై ఫైర్ అయ్యాడు. సంచాల్ అంటే అంపైర్, ఆట మధ్యలో ఇంటర్‌ఫియిర్ అవ్వకూడదు.. మరి నువ్వెందుకు పాయింట్స్ ఇస్తున్నావ్ అంటూ గట్టిగా ఇచ్చి పడేశాడు. కన్ఫ్యూజ్ అయ్యానంటూ.. ఫస్ట్ అనౌన్స్‌మెంట్‌లో తనను సంచాలక్ అని చెప్పలేదంటూ సందీప్ కవర్ చేద్దామని ప్రయత్నించగా.. నాగార్జునకి ఎక్కడ లేని కోపమొచ్చింది. అసలు నువ్వు కంటెండర్ కాదు.. మరి నిన్ను ఎందుకు పిలుస్తారు.. ఏమవసరం.. నువ్వు పెద్ద పిస్తావనా? అంటూ తిట్టిపడేశాడు.

అనంతరం సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నది ఎవరు, ఎవరు గేమ్‌ ఛేంజర్‌ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో యావర్‌గా గేమ్‌ ఛేంజర్‌గా నాలుగు ఓట్లు పడ్డాయి. దీంతో హౌజ్‌లో గేమ్‌ ఛేంజర్‌ అయ్యాడు. ఇక సేఫ్‌ గేమ్‌కి సంబంధించి తేజకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆయన సేఫ్‌గా ఆడుతున్నాడని చెబుతున్నారు. దీంతో ఆయనకు పనిష్‌మెంట్‌గా హౌజ్‌లో అంట్లు అన్ని తోమే శిక్ష వేశాడు. రతిక మీద కూడా నాగర్జున ఫైర్ అయ్యాడు. అసలు హౌస్ లో ఉన్నావా అని అడిగాడు. ఏం ఆలోచిస్తున్నావని ప్రశ్నించగా.. తన ఎక్స్ గురించిన విషయాన్ని చెప్పింది రతిక. తనకు తన మాజీ లవ్‌ స్టోరీ గుర్తొస్తుందని చెప్పడంతో నాగార్జున రియాక్ట్ అయ్యాడు. ఎక్స్ అంటే అయిపోయిన టైమ్‌ అని, దాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకోవద్దని చెప్పాడు. అయిపోయినదాని గురించి ఆలోచిస్తే.. ప్రస్తుతంలో బతకలేవని, భవిష్యత్ కూడా బాగుండదు అని క్లాస్ పీకాడు.




Updated : 24 Sept 2023 9:08 AM IST
Tags:    
Next Story
Share it
Top