Bigg Boss 7: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?
X
ముందుగా చెప్పినట్లుగానే బిగ్ బాస్ తెలుగు 7 సీజన్.. ఇంతకుముందు సీజన్ల కంటే చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే.. మొదటివారం ఎలిమినేషన్ అయిపోగా.. రెండోవారం నామినేషన్స్ ముగిశాయి. ఈవారం మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. మరి.. వీరిలో రెండోవారం బిగ్ బాస్ హౌస్‌ను వీడబోయేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హీరోయిన్ కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి గుడ్ బై చెప్పగా.. ఈ వారం మాత్రం ముఖ్యంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయ్.
రెండో వారానికి సంబంధించిన నామినేషన్లలో మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. వీరిలో.. శివాజీ, షకీలా, శోభా శెట్టి, టేస్టీ తేజా, రతిక, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. దీంతో.. వీరిలో హౌస్ లో మిగిలేది ఎవరు.. కంటిన్యూ అయ్యేది ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మొదటి వారంతో పోల్చుకుంటే రెండో వారం నామినేషన్స్.. ప్రేక్షకులను ఆకర్షించేలా సాగాయి. పైగా బిగ్ బాస్ ఈ నామినేషన్స్ మాత్రమే రెండురోజులు ప్రసారం చేశారు. ముఖ్యంగా.. శివాజీ, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్.. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ చూసే ఫ్యాన్స్‌కు ఫుల్ మజాను అందించాయి. గత ఆరు సీజన్లలో ఒక్కో కంటెస్టెంట్‍కు 10 ఓట్లల్లో ఎన్నైనా వేసుకునే అవకాశం ఉండగా.. ఈ సారి.. ఒక కంటెస్టెంట్‍కు ఒక్క ఓటు మాత్రమే వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఇక రెండో వారం హౌస్ నుంచి ఎలిమినేటై.. బయటకు వచ్చే వారిలో పల్లవి ప్రశాంత్ మరియు షకిలా ఉన్నారని టాక్. షకిలా ఎక్కువగా ఓట్లు రావడం లేదని ప్రచారం జరుగుతుండగా... పల్లవి ప్రశాంత్ ని ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించి సీక్రెట్ రూమ్‌లోకి తోసేసి.. ఆ తర్వాత తిరిగి హౌస్‌లోకి తీసుకువస్తారని కూడా అంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్‌కు కావాల్సినంత సింపతీ వర్కౌట్ అయ్యింది. హౌస్‌లో ఉన్నవారు ప్రశాంత్‌ను టార్గెట్ చేయడంతో.. బయట ఉన్న ప్రేక్షకుల్లో అతడికి ఆదరణ పెరిగింది. దీంతో.. రైతు బిడ్డకు భారీగానే ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. సరిగ్గా.. ఇక్కడే బిగ్ బాస్ గేమ్ ఛేంజ్ చేస్తున్నట్టు సమాచారం. పల్లవి ప్రశాంత్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించడం ద్వారా.. సెన్సేషన్ క్రియేట్ అవుతుందని.. తద్వారా.. సీజన్ 7 మరింత రసవత్తరంగా మారుతుందని బిగ్ బాస్ టీమ్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. రెండో వారం ఎవరు ఇంటికి వెళ్తారనేది ఉత్కంఠగా మారింది.