Bigg Boss Telugu 7 Winner: Pallavi Prashanth : బిగ్‌బాస్ 7 తెలుగు విన్నర్ 'పల్లవి ప్రశాంత్'
X
బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. 105 రోజులపాటు సాగిన రియాలిటీ షోలో అత్యధిక మంది ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రశాంత్, బిగ్‌బాస్ టైటిల్ నెగ్గిన తొలి కామన్ మ్యాన్‌గా రికార్డుకొట్టాడు. చివరి వరకూ నటుడు అమర్ దీప్, పల్లవి ప్రశాంత్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సంపాదించిన పల్లవి ప్రశాంత్ ‘బిగ్‌బాస్ సీజన్-7’ (bigg boss 7 telugu) టైటిల్‌ను సొంతం చేసుకున్నాడని హోస్ట్ నాగార్జున అక్కినేని ప్రశాంత్‌ను విన్నర్‌గా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ ఫినాలేకి మాస్ మహారాజ రవితేజ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు.
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని అనగానే.. నాగార్జున కాళ్లపై పడి భోరున ఏడ్చాడు ప్రశాంత్. రైతు బిడ్డ.. భూమి బిడ్డ అని నాగార్జున అనేసరికి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ప్రశాంత్. అనంతరం బిగ్ బాస్ ట్రోఫీని ప్రశాంత్‌కి నాగార్జున చేతుల మీదుగా అందించారు. ప్రైజ్ మనీ రూ.35 లక్షలతో పాటు.. వితారా బ్రెజా కారు, రూ.15 లక్షల జ్యూయిలరీని ప్రశాంత్‌కి బహుమతి అందించారు.
ఇక గ్రాండ్ ఫినాలో సీనియర్ నటుడు శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్, అమర్ దీప్ టాప్-6లో నిలిచారు. వీరిలో ప్రశాంత్, అమర్దీప్ తొలి రెండు స్థానాల్లో నిలవగా, శివాజీ మూడో ప్లేస్, యావర్ నాలుగో స్థానం, ప్రియాంక, అర్జున్ వరుసగా ఐదు, ఆరో ప్లేస్‌లో సీజన్‌ను ముగించారు.