Home > సినిమా > Bigg Boss7: సంచలనాలకు కేరాఫ్ బిగ్బాస్ సీజన్7.. రికార్డులు కొల్లగొడుతూ..!

Bigg Boss7: సంచలనాలకు కేరాఫ్ బిగ్బాస్ సీజన్7.. రికార్డులు కొల్లగొడుతూ..!

Bigg Boss7: సంచలనాలకు కేరాఫ్ బిగ్బాస్ సీజన్7.. రికార్డులు కొల్లగొడుతూ..!
X

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయినప్పటి నుంచి ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్ లో వచ్చి ఉత్కంఠ రేపుతుంది. టాస్క్ లు, నామినేషన్స్ తో ఆడియెన్స్ కు కావాల్సిన వినోదాన్ని అందిస్తుంది. కాగా తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. గత సీజన్ తో పోలిస్తే 40 శాతం అధిక రేటింగ్ ను సొంతం చేసుకుంది. తొలి రోజే 29 మిలియన్ల మంది ఈ షోను వీక్షించారు. దాంతో అందరి అంచనాలను అందుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. వ్యూవర్షిప్ పెరిగి బుల్లి తెర చరిత్రలోనే సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.





తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇద్దరిలో ఒకరు ఈ షోను చూస్తున్నారట. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ను సగటున 7.1 శాతం రేటింగ్ తో చూస్తే.. ఒక్క హైదరాబాద్ లోనే అత్యధికంగా 8.7 శాతం రేటింగ్ తో చూడటం విశేషం. బిగ్ బాస్ కు స్టార్ మాలోనే కాదు.. ఓటీటీలోనూ వివరీతమైన ఆదరణ లభిస్తుంది. యూట్యూబ్ లో రిలీజ్ అయిన ప్రోమోలు కూడా అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నారు.




Updated : 14 Sept 2023 10:37 PM IST
Tags:    
Next Story
Share it
Top