Home > సినిమా > Bigg boss season 7 list : ఫైనల్ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..

Bigg boss season 7 list : ఫైనల్ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..

Bigg boss season 7 list : ఫైనల్ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..
X

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. దీంతో లాంఛింగ్ ఈవెంట్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్లు, ఏవీలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఫైనల్ చేసిన కంటెస్టెంట్లలో కొందరు రాకపోవడంతో బిగ్ బాస్ టీం వారి స్థానంలో లాస్ట్ మినిట్లో వేరే వారికి కన్ఫర్మేషన్ మెయిల్ పంపినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మహిళా కంటెస్టెంట్ల కన్నా మగవారి సంఖ్య ఎక్కువ ఉండనున్నట్లు తెలుస్తోంది. టీం సెలెక్ట్ చేసిన 22మందిలో మెజార్టీ మేల్ కంటెస్టెంట్లే ఉన్నట్లు సమాచారం. ఆ కారణంగా కొందరు ఫీమేల్ కంటెస్టెంట్లు లాస్ట్ మినిట్లో బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈసీజన్లో ఎక్కువ మంది సీరియల్ నటులకు ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. హౌస్లో సగం మంది బుల్లి తెర నటులే ఉంటారని వార్తలు వస్తున్నాయి.

సీజన్ 7లో కపుల్, ట్రాన్స్ జెండర్ కేటగిరి నుంచి ఎవరినీ సెలెక్ట్ చేయలేదని సమాచారం. అమర్ దీప్ - తేజస్విని, ఆట సందీప్ - జ్యోతి కపుల్స్ లో ఎవరో ఒకరు జోడిగా హౌస్లో అడుగుపెడతారని టాక్ వినిపించింది. అయితే ఈసారి కపుల్ ఎంట్రీ ఉండదని సమాచారం. ఇక ట్రాన్స్ జెండర్ కేటగిరిలో జబర్దస్త్ తన్మయిని అప్రోచ్ అయ్యారని టాక్ వినిపించినా తను మాత్రం హౌస్లో అడుగుపెట్టడం లేదని తెలుస్తోంది. మహేష్ ఆచంట ఈసారి హౌస్లోకి వస్తారని ఊహాగానాలు వినిపించినా సినిమాల్లో బిజీగా ఉండటంతో రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూట్యూబర్ కేటగిరిలో మై విలేజ్ షో అనిల్ జీలకు కన్ఫర్మేషన్ మెయిల్ రావడంతో ఆలస్యం కావడం, సినిమా స్క్రిప్టు రెడీగా ఉండటంతో బిగ్ బాస్లోకి వెళ్లొద్దని నిర్ణయించికున్నట్లు అనిల్ స్వయంగా చెప్పారు.ఇదాలా ఉంటే సీజన్ 7లో జబర్దస్త్ నుంచి ఎవరికీ ఛాన్స్ ఇవ్వనట్లు తెలుస్తోంది. నరేష్, రియాజ్, బుల్లెట్ భాస్కర్ లలో ఒకరు వస్తారని వార్తలు వచ్చినా వారెవరూ రావడం లేదని సమాచారం.

ఫైనల్ కంటెస్టెంట్ల లిస్టు ఇదే

సీరియల్ ఆర్టిస్ట్ కేటగిరి

ప్రభాకర్

అమర్దీప్

క్రాంతి

అంబటి అర్జున్

శోభితా శెట్టి

ఐశ్వర్య పిస్సే

ప్రియాంక జైన్

ప్రిన్స్ ఎవర్

సినీ కేటగిరి

ఫర్జానా

శివాజీ

షకీల

గౌతమ్ కృష్ణ (ఆకాశ వీధుల్లో ఫేం)

సాయి కేతన్ రావ్ ( వల మూవీ ఫేం)

శుభ శ్రీ (అమిగోస్ ఫేం)

రితికా నాయక్ (అశోక వనంలో అర్జున కల్యాణం ఫేం)

యూట్యూబర్ కేటగిరి

టేస్టీ తేజ

నిఖిల్

సింగర్ కేటగిరి

భోలే షావలి

దామిని

కొరియోగ్రాఫర్ కేటగిరి

ఆట సందీప్

కామన్ మేన్ కేటగిరి

పల్లవి ప్రశాంత్

యాంకర్ కేటగిరి

టీవీ 9 ప్రత్యూష


Updated : 1 Sept 2023 5:16 PM IST
Tags:    
Next Story
Share it
Top