Home > సినిమా > బిగ్‌బాస్ 7 సీజన్ షూరు.. ట్రాన్స్‌జెండర్లతో షకీలా.. శివాజీ.. ఇంకా..

బిగ్‌బాస్ 7 సీజన్ షూరు.. ట్రాన్స్‌జెండర్లతో షకీలా.. శివాజీ.. ఇంకా..

బిగ్‌బాస్ 7 సీజన్ షూరు.. ట్రాన్స్‌జెండర్లతో షకీలా.. శివాజీ.. ఇంకా..
X

తెలుగు బుల్లితెర రచ్చ షో మొదలైంది. ఆటపాటలు, అలకలు, కొట్లాలు, ముద్దుముచ్చట్లతో షరా మూమూలుగా రియాలిటీ సందడికి తెరలేచింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం రాత్రి 7 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. రెగ్యులర్ హోస్ నాగార్జున కంటెస్టెంట్లను ఒకరి తర్వాత ఒకరి ఆహ్వానిస్తున్నారు. వారి టాలెంట్, నేపథ్యం వంటి వివరాలతో ఏవీలు ప్రదర్శిస్తున్నారు. పనిలో పనిగా విజయ్‌ దేవరకొండ తన ‘ఖుషి’ని, నవీన్‌ పొలిశెట్టి తన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమా ప్రచారానికి కూడా షోను వేదిక చేసుకున్నారు. తాజా సీజన్‌లో మాంచి మసాలా ఉన్నట్లు కంటెస్టెంట్ల జాబితా చెబుతోంది.

షకీలా, శివాజీ, శోభాశెట్టి, ఆట సందీప్ వంటి మరెందరో జనానికి బాగా పరిచయమున్న వారిని, లేనివారిని హౌస్‌లోకి పంపారు. సీనియర్ నటి షకీలా తనకు ఇష్టమైన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లతో కలసి వేదికపై వచ్చారు. తను ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం పనిచేస్తున్నానని చెప్పారు. నాగ్ ఆమెను అభినందిస్తూ తెరపై చూసే షకీలా వేరు, నిజ జీవితంలోని షకీలా వేరు అన్నారు. మొదటి ఐదుగురు కంటెస్టెంట్‌లకు నాగార్జున విచిత్రమైన ఆఫర్‌ ఇచ్చారు. సూట్ కేస్‌లో రూ.20 లక్షలు పెట్టి, వెళ్లిపోవానుకునేవాళ్లు దాన్ని తీసుకుని వెళ్లొచ్చు అన్నారు. ఎవరూ స్పందించకపోవడంతో మొత్తాన్ని రూ.35లక్షలకు పెంచారు. అయినా ఎవరూ ఆసక్తి చూపేదు. తర్వాత ఇతర కంటెస్టెంట్లను ఆహ్వానించారు.

షోలోకి ప్రవేశంచింది వీరే...

ప్రియాంక జైన్‌ :





టీవీ సీరియళ్లతోపాటు కొన్ని సినిమాల్లోనూ నటించింది. ‘వినరా సోదరా వీరకుమార’, ‘చల్తే చల్తే’, ‘ఎవడూ తక్కువ కాదు’ ఆమె చిత్రాలు.

శివాజీ:




పరిచయం అక్కర్లేని టాలీవుడ్ నటుడు. సినిమాల్లో గ్యాప్ రావడంతో రాజకీయాల్లోకి వెళ్లి కొన్నాళ్లు హల్‌చల్ చేశారు. ‘మిస్సమ్మ’, ‘తాజ్ మహల్’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి’ల హీరో. ‘గ్యాంగ్‌స్టర్స్‌’ వెబ్‌సిరీస్‌లోనూ ఉన్నారు.

దామిని భట్ల:




సినీగాయని. బాహుబలి చిత్రంలోని ‘పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో’, కొండపొలం మూవీలోని ‘ధమ్‌ ధమ్‌ ధమ్‌’ పాటలతో పేరు తెచ్చుకుంది.

ప్రిన్స్ యువార్:





బాడీ బిల్డర్‌, మోడల్‌. చాలా సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించాడు.


శుభశ్రీ:





రుద్రవీణ (2000) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. క్రీడాకారిణి. సినిమాల్లోకి రాకముందు కొన్నాళ్లు లాయర్‌గా పనిచేసింది. స్వస్థలం ఒడిశా. ‘వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా 2020’ కిరీట విజేత.

షకీలా:





దక్షిణ భారతంలోని అన్ని సినీపరిశ్రమల్లో సత్తా చాటిన నటి. రొమాన్స్, కామెడీ పాత్రలతో మెప్పించింది.

సందీప్:





‘ఆట’ సందీప్ కొరియోగ్రాఫర్. ఓ రియాలిటీలో షోలో గెలిచానని, బిగ్ బాస్ టైటిల్ నాదనని చెప్పుకొచ్చాడు.

శోభాశెట్టి:





బుల్లితెర ప్రతినాయకి. ‘కార్తీక దీపం’లో మోనికగా నెగెటివ్‌ రోల్‌ పోషించేసి నిత్యజీవితంలో మాత్రం చాలా మంచిదట. రమ్యకృష్ణలా ఉంటాను కాబట్టి మంచి పాత్రలు కావాలని చెప్పింది.

యూట్యూబ్ టేస్టీ తేజ:




యూట్యూబర్‌. ఫుడ్ వ్లాగ్స్ చూపిస్తుంటాడు. సినిమాల ప్రచారంలో టేస్టులు చూపిస్తుంటాడు. 150 మందికి పైగా సెలబ్రిటీలతో పనిచేశానని నాగ్ దగ్గర గొప్పలు పోయాడు.

రతిక:





నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్.

గౌతమ్ కృష్ణ:

డాక్టర్ కెరీర్ వదులుకుని యాక్టర్ మారాడు. ‘ఆకాశ వీధుల్లో’ చిత్రంలో నటించాడు. యాక్టర్ కావాలన్నది తన కోరిక అని, ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో డాక్టర్‌ను అయ్యానని చెప్పాడు.

కిరణ్ రాథోడ్:





దక్షిణాది మూవీలతోపాటు కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించింది. తెలుగు మాట్లాడడం దాని, హౌసులో నేర్చుకుంటానని చెప్పుకొచ్చింది.

పల్లవి ప్రశాంత్:





రైతుబిడ్డ. యూట్యూబ్ చానల్ ఉంది. బిగ్‌బాస్‌లోకి రావడానికి చాలా వీడియోలు చేసి పేరు తెచ్చుకున్నానన్నాడు. నాగార్జునకు ఓ మిరపకాయ మొక్కను గిఫ్టుగా ఇచ్చి ఘాటు రేపాడు. మొక్క ఎండిపోతే శిక్ష పడుతుందని నాగ్ హెచ్చరించాడు.

అమర్‌దీప్:




‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో పేరు తెచ్చుకున్నాడు. అసలు పేరు అమర్‌దీప్ చౌదరి.

Updated : 3 Sept 2023 10:45 PM IST
Tags:    
Next Story
Share it
Top