Bigg Boss ott: బిగ్బాస్ నిర్వాహకుల షాకింగ్ నిర్ణయం.. ఇకపై అవన్నీ బంద్
X
బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 7 సీజన్స్ పూర్తిచేసుకుంది. కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అయితే 7వ సీజన్ ముగింపు వేడుకల్లో పల్లవి ప్రశాతం అభిమానులు సృష్టించిన వీరంగం అంతా ఇంతా కాదు. కార్లు, బస్సుల అద్దాలు ద్వసం చేసి రచ్చ చేశారు. ఈ కారణంగా పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లొచ్చాడు. దీంతో బిగ్ బాస్ షోపై అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. షో బ్యాన్ చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఈ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా పోలీసులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో షో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అదేంటంటే.. ఫైనల్ షో ముగిసిన అనంతరం, కంటెస్టెంట్స్ ర్యాలీలు తీయకూడదనే కండీషన్ పెట్టనున్నారు. ఈ మేరకు పక్కా ప్రణాళికతో అగ్రిమెంట్ కూడా చేసుకోనున్నారు. గెలిచినవారు బయటికి వచ్చాక.. ర్యాలీలు, గ్యాదరింగ్ లు చేయకుండా.. సైలెంట్ గా వెళ్లిపోవాలని అగ్రిమెంట్ లో సైన్ చేయాలి. దీనివల్ల రోడ్లపై న్యూసెన్స్ తగ్గే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే.. 2024 ఫిబ్రవరిలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం సెట్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైందట.