బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ అరెస్ట్
X
బిగ్ బాస్ విన్నర్ యూట్యూర్ ఎల్విష్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. యూపీలోని నోయిడా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.అతడిపై అక్రమంగా పాము విషం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ వ్యక్తి కెమెరాతో షూట్ చేసినందుకు అతడిపై భౌతికంగా దాడికి పాల్పడటంతో వెలుగులోకి వచ్చాడు. కాగా ఎల్విష్ వైల్డ్ కార్డ్‌లో వచ్చి టైటిల్ గెలుచుకున్న మొదటి కంటెంస్ట్‌గా చరిత్ర సృష్టించారు.పాము విషం కేసులో నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసినట్లు నోయిడా డీసీపీ విద్యాసాగర్ మిశ్రా వెల్లడించారు.
ఇవాళ అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎల్విశ్ యాదవ్ పోలీసులు కస్టడీలోనే ఉన్నారు. తాజాగా అతన్ని కోర్టుకు తీసుకెళ్తున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతేడాది గురుగ్రామ్, నోయిడాలోని రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎల్విష్‌ను పోలీసులు ప్రశ్నించారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను యూట్యూబర్ ఎల్వీశ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో తాను దోషిగా రుజువైతే కెమెరాలో బట్టలు విప్పి డ్యాన్స్ చేస్తానని అన్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.