Home > సినిమా > Bigg Boss7 : రైతు బిడ్డ తరువాత అందరూ ఆమెనే టార్గెట్ చేశారా?

Bigg Boss7 : రైతు బిడ్డ తరువాత అందరూ ఆమెనే టార్గెట్ చేశారా?

Bigg Boss7 : రైతు బిడ్డ తరువాత అందరూ ఆమెనే టార్గెట్ చేశారా?
X

బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు మరింత ఇంట్రెస్టింగ్‎గా మారుతుంది. స్టార్టింగ్‎లో కాస్త బోర్ కొట్టినా.. కంటెస్టెంట్లు తమ ఆట తీరును మెరుగుపరుచుకుని ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరీ ముఖ్యంగా సెకెండ్ వీక్ నామినేషన్ ప్రక్రియ ఓ రేంజ్ లో హౌస్ లో హీట్ ను పెంచింది. ఇదిలా ఉండే నామినేష్ల సమయంలో హౌస్ లోని సీరియల్ యాక్టర్లు అందరూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు వ్యతిరేకంగా నామినేషన్ చేశారు. కానీ ప్రశాంత్‎కు ఓటింగ్‎లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చింది. ఓటింగ్‎లో మిగతా కంటెస్టెంట్లకంటే ప్రశాంత్ కు అత్యధిక ఓట్లు వచ్చాయి. ఇది రైతు బిడ్డకు ప్లస్ పాయింట్‎గా మారుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్‎లోని వారంతా రతిక రోజ్‎ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అందరి వేళ్లు ఆమె వైపే చూపిస్తున్నాయి. దీనికి ఓ కారణం లేకపోలేదు. అయినా ఆమె తన మొండి పట్టుదలను వీడటం లేదు. నేను అనుకున్నది నాకు కావాలి అన్నట్లుగా గేమ్ అడుతోంది.

హౌస్‎లో పవర్ అస్త్ర దొంగిలించిన విషయంలో రచ్చ రచ్చ జరిగింది. ఈ క్రమంలో ఆట సందీప్ రతికపై అనుమానం ఉందన్నాడు. కానీ నిజానికి పవర్ అస్త్ర దొంగిలించింది మాత్రం శుభ శ్రీ. ఇదే విషయంపై టేస్టీ తేజ క్లారిటీ ఇచ్చాడు. దీనిని బట్టి ఆట సందీప్‍కు రతికపై వ్యతిరేకత ఉన్నట్లు అర్థమవుతోంది. అందుకే ఆమెపై డౌట్ ఉందన్నాడు. ఇక మహాబలి టీమ్ వర్సెస్ రణధీర టిమ్ మధ్య కాంపిటీషన్ జరిగింది. ఈ పోటీలో రణధీర టీమ్ విన్నర్‎గా నిలిచింది. అయితే బిగ్ బాస్ ఊరికే ఉంటాడా.. ఓ ఫిట్టింగ్ పెట్టాడు. మహాబలి టీమ్‎లోని వారంతా ..రణధీర టీమ్‏లో ఎవరైతే పవర్ అస్త్రాకు అర్హులు కాదో వారి దగ్గర ఉన్న మాయాస్త్రా భాగాన్ని తీసుకుని వరే కంటెస్టెంట్‎కు ఇవ్వాలన్నాడు.

దీంతో మహాబలి టీమ్ సభ్యులు నిర్ణయం తీసుకునేందుకు గంటలు గంటలు తీసుకున్నారు. సుదీర్ఘంగా చర్చించిన తరువాత మొదటగా శుభ శ్రీ , ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ వెళ్లారు ఇక ఆ తర్వాత రతికను వెళ్లమని చెప్పింది టీమ్. కానీ, ఆమె మాత్రం నేను వెళ్లనని భిష్మించుకుని కూర్చొంది. దీంతో హౌస్‎లో దామినితో పెద్ద వారే జరిగింది. నన్ను వెళ్లమని చెప్పేందుకు నువ్వు ఎవరు అంటూ దామినిపై రతిక ఓ రేంజ్‎లో ఫైర్ అయ్యింది. నువ్ గట్టిగా అరిస్తే.. నీకంటే గట్టిగా నేను అరవగలను అని చెప్పి పైపైకి వెళ్తూ మాట్లాడింది. ఇదే క్రమంలో రతిక గౌతమ్‎తో కూడా గొడవ పడింది. ఇక టేస్టీ తేజ .. నిన్ను పంపించి నేను తక్కువ కాను అని ఏకంగా ముఖం మీద చెప్పేశాడు.

మహాబలి టీమ్‍లోని వారంతా రతికను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మాత్రం మొండి పట్టుదలతో ఎవ్వరి మాటా వినలేదు. నేను లాస్ట్‎లో వెళ్తాను అని అలా కూర్చుండిపోయింది. గేమ్ ఛేంజ్ చేస్తాను అని పట్టుబట్టింది. దీంతో హౌస్‎లోని సభ్యులంతా రతికపై అసహనం వ్యక్తం చేశారు. రెండు టీమ్‎ల సభ్యులు రతిక తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక సంచాలకుడిగా ఉన్న ఆట సందీప్ కూడా మండి పడ్డాడు. ఈ గొడవ ఇలాగే కొనసాగడంతో చేసేదేమి లేక బిగ్ బాస్ చివరికి టాస్క్ ఛేంజ్ చేశాడు. దీంతో అమర్ దీప్ రతికపై గట్టిగా అరిచాడు. ఆమె తీరుతో మిగతా వారంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని శోభా శెట్టి కూడా సీరియస్ అయ్యింది. ఈ టాస్క్‎లో రతిక బిహేవియర్ ఎవ్వరికీ నచ్చలేదు. దీంతో హౌస్‍లోని ప్రతీ ఒక్కరు రతికకు వ్యతిరేకంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. నామినేషన్ల సమయంలో పల్లవి ప్రశాంత్‎ను టార్గెట్ చేసినట్లుగా ఈ టాస్క్‎తో అందరూ రతికను టార్గెట్ చేశారని అర్థమవుతోంది. ప్రస్తుతానికి

రతిక పట్ల ఎవరికీ సాఫ్ట్ కార్నర్ లేదు. ఆమె గురించి కంటెస్టెంట్స్ అందరూ నెగెటివ్‎గానే మాట్లాడుకుంటున్నారు.



Updated : 15 Sept 2023 7:59 AM IST
Tags:    
Next Story
Share it
Top