రైతు బిడ్డ దెబ్బకి సీరియల్ బ్యాచ్ అదుర్స్..ఎలిమినేట్ అయ్యేది వాళ్లే!
X
బిగ్ బాస్ సీజన్ 7 సెకెండ్ వీక్ నామినేషన్లు గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగాయి. ఈసారి ఏకంగా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. మరి వీరిలో ఎవరు తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్తారు అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నామినేషన్ రౌండ్ ఓ రేంజ్లో హౌస్‌లో హీట్ పెంచింది . రెండు రోజుల పాటు హోరాహోరీగా సాగిన నామినేషన్లలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍ను హౌస్‌లో సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేసిన విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. స్టార్ మా సీరియల్ బ్యాచ్ అయినా అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి విరుచుకుపడ్డారు. వాళ్లకు ఆట సందీప్, రతిక రోజ్ వత్తాసు పలికారు. మరి వీరిలో ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్స్ వచ్చాయి. ఎవరు టాప్ లో ఉన్నారు ఎవరు లీస్ట్‌లో ఉన్నారు. ఎవరికి ప్రేక్షకులుు తోడుగా నిలిచారు, రెండో వారంలో ఈ 9 మందిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో ఫుల్ సస్పెన్స్ గా మారింది.
బిగ్ బాస్ 7 సీజన్ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఈసారి ఓటింగ్‌లో సీరియల్ బ్యాక్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. రెండో వారం అత్యధిక శాతం ఓట్లతో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో నిలిచాడు. పల్లవి ప్రశాంత్ 39.56 శాతం ఓట్లతో టాప్‍లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత స్థానంలో 20.93 శాతం ఓటింగ్ తో శివాజీ ఉన్నాడు. మూడో స్థానంలో 17.94 శాతం ఓట్లతో అమర్ దీప్ చౌదరి నిలిచాడు. రతికకు 8.18 శాతం, గౌతమ్ కృష్ణకు 3.21 శాతం, ప్రిన్స్ యావర్ 3.06 శాతం, శోభా శెట్టి 2.51 శాతం, షకీలకు 2.34 శాతం, టేస్టీ తేజ 2.28 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. నామినేషన్ల ప్రక్రియలో సీరియల్ బ్యాచ్ పల్లవి ప్రశాంత్‍ను సెంటర్ చేసి అతడిని జీరో చేయాలని తెగ ట్రై చేశారు. కానీ, అదే అతనికి ప్లస్ పాయింట్‌గా మారి అత్యధిక ఓటింగ్ తో హీరోగా నిలిచాడు.
ప్రేక్షకులు ఇదే ఓటింగ్‌ను కొనసాగిస్తే కనుక అతి తక్కువ ఓటింగ్ తో ఉన్న షకీల లేదా టేస్టీ తేజ హౌస్ నుంచి వెళ్లిపోయే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే టేస్టీ తేజ తన కామెడీతో హౌస్‌లోని కంటెస్టెంట్లు , తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు. కాబట్టి, అతను వెళ్లే ఛాన్సెస్ కాస్త తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ టేస్టీ తేజ ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే.. షకీల, శోభా శెట్టిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మరి బిగ్ బాస్ ఈ సెకెండ్ వీక్ ఎవరిని ఎలిమినేట్ చేస్తాడో చూడాల్సిందే.