Home > సినిమా > లలితా జువెలరీని దోచుకున్న దొంగోడిపై బయోపిక్

లలితా జువెలరీని దోచుకున్న దొంగోడిపై బయోపిక్

లలితా జువెలరీని దోచుకున్న దొంగోడిపై బయోపిక్
X

బయోపిక్ సినిమాలు తీయడానికి రియల్ హీరోల కథలే అక్కర్లేదు. నానా ఘోరాలు, నేరాలు, మోసాలు చేసేవారి కథలకు కూడా బోలెడు మార్కెట్ ఉంటుంది. కథను కళాత్మకంగా పండిచారా, లేదా అన్నదే ముఖ్యం. మూవీ బావుంటే బాక్సులు బద్దలే. ఈ సూత్రాన్ని నమ్ముకుని కోలీవుడ్‌లో ‘జపాన్’ పేరుతో ఓ సినిమా తయారైంది. గద్దలు కొట్టి కాకులకు వేస్తాడనే పేరున్న దొంగ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కార్తీ, అనూ ఇమ్మానుయేల్ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా హీరోను పరిచయం చేస్తూ ఓ ప్రోమో వదిలారు. కార్తీ నగల షాపును దోచుకుంటూ, క్లబ్బులో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. రాజా మురుగన్ దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి.

ఈ కథకు ఆధారం 2019లో చెన్నైలో జరిగిన రూ. 13 కోట్ల విలువైన బంగారం చోరీ. తిరువారూర్ మురుగన్ అనే దొంగల ముఠా నాయకుడు ఈ దొంగతనంలో కీలక పాత్ర పోషించాడు. అతడు ఎయిడ్స్‌తో జైల్లో 2020లో చనిపోయాడు. మురుగన్ దొంగసొమ్ముతో విలాసవంతంగా జీవించేవాడు. కొంత సొమ్ములను పేదలకు దానం చేసేవాడు. తమిళనాడు, కర్నాటకల్లో గోల్డ్ షాపులో లక్ష్యంగా చేతివాటం చూపేవాడు. ఒక సామాన్యుడు గజదొంగగా ఎలా మారాడు? అందమైన అమ్మాయిలను ఎలా వల్లో వేసుకుని ఎలా ఎంజాయ్ చేశాడనే ఆసక్తికరమైన అంశాలతో ‘జపాన్’ను వండి వార్చినట్లు తెలుస్తోంది. అయితే హీరోకు మాత్రం ఎయిడ్స్ సోకనట్లు చూపించారని టాక్.





Updated : 6 Jun 2023 9:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top