Home > సినిమా > లటుక్కున పట్టుకుని..గుటుక్కున మింగేసింది

లటుక్కున పట్టుకుని..గుటుక్కున మింగేసింది

లటుక్కున పట్టుకుని..గుటుక్కున మింగేసింది
X

అందరికీ తెలిసినంత వరకు జింకలు స్వచ్ఛమైన శాకాహారులు. ఇవి పచ్చని గడ్డిని, పొదల్లో పెరిగిన పచ్చటి ఆకులను ఆహారంగా తీసుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఇప్పటివరకు జింకలు నాన్‎వెజ్ తిన్న దాఖలాలు లేవు. ఇవి మాంసాహారం జోలికి వెళ్లవు. కానీ హెర్బివర్‌ జాతికి చెందిన ఓ జింక మాత్రం ప్రకృతికి విరుద్ధంగా పచ్చి మాంసాన్ని తింటూ అందరినీ షాక్‌‎కు గురిచేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు . తరచుగా వన్యప్రాణులకు సంబంధించిన అద్భుతమైన వీడియోలను తన ఫాలోవర్స్‎తో షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ జింక పామును తిన్న వీడియోను ఈయన పంచుకున్నారు. 21 సెకన్ల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో జింక చనిపోయిన పామును కసాకసా నమిలి మింగడం కనిపిస్తోంది.

హెర్బివర్‌ జాతికి చెందిన ఈ జింక ఇలా పామును తినడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు ఈ వీడియోను చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు అడవి జంతువులు ఇలా ప్రకృతికి విరుద్ధంగా కూడా నడుచుకుంటాయని ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తుంది.

Updated : 12 Jun 2023 2:27 PM IST
Tags:    
Next Story
Share it
Top