బ్లాక్‌బస్టర్ విలేజ్ డ్రామా..మట్టికథకు రేటింగ్స్ అదుర్స్
X
తెలంగాణ సినిమా 'మట్టికథ' థియేటర్స్‌లో దుమ్ముదులుపుతోంది. సినిమా విడుదలైన తొలిరోజే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మట్టికథ మనసుకు హత్తుకునే కథ అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యారు. విలేజ్ డ్రామా బ్లాక్‌బస్టర్ అంటూ ప్రముఖ ప్లాట్ఫార్మ్స్ కూడా మట్టికథకు మంచి రేటింగ్స్ ఇచ్చాయి. మనిషికి భూమికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా ఎంతో అద్భుతంగా చూపించారు డెబ్యూ డైరెక్టర్ పవన్ కడియాలా. భూమి కోసం ప్రాణాలను కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా అంకితం అంటూ మూవీ మేకర్స్ తెలిపారు.
మట్టికథకు వచ్చిన రేటింగ్స్ :
ఓటీటీ ప్లే : 3/5
సినీ జోష్ : 3/5
తెలుగు బులిటెన్ : 2.5/5
ఏషియా నెట్ న్యూస్ :2.75/5
123తెలుగు.కాం. : 2.75/5
తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని, పల్లెల్లో ప్రజల జీవిన విధానాన్ని, స్వచ్ఛమైన మనుషుల మనసులను, భూమే ప్రాణంగా, వ్యవసాయమే జీవనాధారంగా బ్రతికే ప్రజల భావోద్వేగాలను స్పష్టంగా చూపించే కథాంశంతో వచ్చిన సినిమా `మట్టి కథ`. ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. పవన్ కడియాలా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మైక్ మూవీస్ బ్యానర్లో అప్పిరెడ్డి నిర్మించారు. సతీశ్ మంజీర సహనిర్మాతగా వ్యవహరించారు. సినిమా విడుదలకు ముందే మట్టి కథ పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఏకంగా 9 అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ పల్లె జీవితాన్ని ఎంతో సహజంగా తెరకెక్కించటంలో యువ దర్శకుడు పవన్ కడియాల సక్సెస్ అయ్యారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు తమ నటనతో అందరికీ బాగా కనెక్ట్ అయ్యారు.