Home > సినిమా > బెట్టింగ్ యాప్ కేసు.. టాప్ హీరోకు ఈడీ సమన్లు

బెట్టింగ్ యాప్ కేసు.. టాప్ హీరోకు ఈడీ సమన్లు

బెట్టింగ్ యాప్ కేసు.. టాప్ హీరోకు ఈడీ సమన్లు
X

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ మహదేవ్ బుక్పై నమోదైన కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 6 (శుక్రవారం) ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మహదేవ్ యాప్ ను ప్రమోట్ చేసేందుకు రణబీర్ పలు కమర్షియల్ యాడ్స్లో నటించాడు. ఇందుకుగానూ ఆయన భారీ మొత్తంలో నగదు తీసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది.

మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌పై ఫిర్యాదులు అందడంతో పలు రాష్ట్రాల పోలీసులతో పాటు ఈడీ విచారణ జరుపుతోంది. తెలంగాణ, ఏపీలోనూ మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌పై కేసులు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సేకరించిన డిజిటల్ సాక్ష్యాధారాల ప్రకారం.. ఈ కంపెనీకి రూ.112 కోట్లు హవాలా మనీ ట్రాన్స్ఫర్ అయింది. అందులో హోటల్ బుకింగ్‌ కోసం రూ.42 కోట్లు నగదు రూపంలో చెల్లించారు.

ఆన్లైన్ గేమింగ్ కు సంబంధించి కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం బెట్టింగ్ ను నిషేధించారు. అయితే మహదేవ్ ఆన్‌లైన్ యాప్ మాత్రం నిబంధనలు బేఖాతరు చేస్తూ బెట్టింగులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో పలు కీలక ఆధారాలు సేకరించింది. రణబీర్ కపూర్ తో పాటు పలువురు బాలీవుడ్ నటులు, గాయకులు సైతం ఈ యాప్ ప్రమోట్ చేసిన వారిలో ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యుఏఈలో జరిగిన మహదేవ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ పెళ్లికి, సక్సెస్ పార్టీకి వారు హాజరు కావడంపై దృష్టి సారించింది. వారందరికి త్వరలోనే సమన్లు జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం.




Updated : 4 Oct 2023 5:05 PM IST
Tags:    
Next Story
Share it
Top