Home > సినిమా > మరుగుదొడ్లు కడిగా.. సల్మాన్ ఖాన్

మరుగుదొడ్లు కడిగా.. సల్మాన్ ఖాన్

మరుగుదొడ్లు కడిగా.. సల్మాన్ ఖాన్
X

కొన్ని పనులపై మనదేశంలో వివక్ష ఉంది. కారణాలేవైనా పారిశుద్ధ్య కార్మికలను చిన్నచూపు చూస్తుంటారు. రోజూ మనం ఇళ్లలో చేసుకునే పనులనే బయట వేరేవాళ్లు చేస్తే చులకన! డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కొందరికి లోపల కల్మషమే ఉంటుంది. అది తప్పని చెబుతూ, పారిశుధ్యం గురించి అవగాహన పెంచడానికి స్వచ్ఛ్ భారత్ వంటి కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే తను కూడా మరుగుదొడ్లు కడిగానని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్-2 ఓటీటీ సీజన్‌ సోమవారం ముగిసింది. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన ఎల్విశ్ యాదవ్‌ విన్నర్‌ అయ్యారు. ఈ షో ఓటీటీ సీజన్‌-2 గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ తన జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు.

‘‘నేను హాస్టల్లో ఉన్నప్పుడు టాయిలెట్లు కడిగాను. జైల్లో ఉన్నప్పుడు కూడా కడిగాను. బిగ్ బాస్ గత సీజన్లలోని కంటెస్టంట్లకు ఆ పని నేర్పాను. హౌస్‌లోకి వెళ్లి శుభ్రం చేయాల్సి వచ్చింది... మనం చేసే పనిని అల్పమైనదిగా, అవమానకరమైనదిగా భావించకూడదు. ఈ సీజన్‌లో పోటీ పడిన పూజా భట్ టాయిలెట్‌లు, వాష్‌రూమ్‌లను శుభ్రంగా ఉంచడం ప్రశంసనీయం’’ అని అన్నారు. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ కొన్నాళ్లు జైల్లో గడిపాడు. తర్వాత నిర్దోషిగా బయటపడ్డారు. పేవ్‌మెంట్‌పై నిద్రపోతున్నవారిని కారుతో గుద్దిచంపిన కేసులోనూ ఆయన కొన్నాళ్లు జైల్లో ఉన్నారు.

Updated : 15 Aug 2023 2:16 PM IST
Tags:    
Next Story
Share it
Top