Home > సినిమా > పూరీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..డబుల్ ఇస్మార్ట్‎లో బాలీవుడ్ స్టార్

పూరీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..డబుల్ ఇస్మార్ట్‎లో బాలీవుడ్ స్టార్

పూరీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..డబుల్ ఇస్మార్ట్‎లో బాలీవుడ్ స్టార్
X

లైగర్‌ మూవీ డిజాస్టర్‎తో ఘోరమైన పరాజయాన్ని చూసిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసారి డబుల్ హిట్ సాధించాలన్న టార్గెట్‎తో డబుల్ ఇస్మార్ట్‌ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తరువాత హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్, పూరి కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది. గతంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ వెండితెరపైన ఏ రేంజ్‎లో దుమ్ముదులిపిందో అందరికీ తెలిసిందే. అదే ఊపుతో లైగర్ ఫ్లాపును పక్కన పెట్టి డబుల్ ఇస్మార్ట్‎పై పూర్తిగా దృష్టి సారించారు పూరి. తాజాగా మూవీకి సంబంధించి మరో అప్‎డేట్ ఇచ్చి అందరి మైండ్ బ్లాక్ చేశారు డైరెక్టర్ . డబుల్ ఇస్మార్ట్‎లో బిగ్ బుల్‎ పాత్రను బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్‎ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. సంజయ్ ఎంట్రీతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

'ఇస్మార్ట్‌ శంకర్‌'తో రామ్‌ పోతినేని లవర్ బాయ్ ఇమేజ్ మరిపోయింది. మాస్ ఇమేజ్​ ట్యాగ్​లైన్​ తగిలించుకుని కెరీర్​లో ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు లేటెస్టుగా 'ఇస్మార్ట్‌ శంకర్‌'కు సీక్వెల్​గా వస్తున్న 'డబుల్‌ ఇస్మార్ట్‌'లోనూ దుమ్ముదులిపేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. హీరో కన్ఫార్మ్ అయినప్పటికీ ఇప్పటి వరకు హీరోయిన్, విలన్ ఎవరనేదానిపై డెరెక్టర్ క్లారిటీ ఇవ్వలేదు. విలన్‎గా బాలీవుడ్​ నటుడినే ఎన్నుకుంటారనే ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది. ఈ క్రమంలోనే ఆ ప్రచారాన్నే నిజం చేశారు పూరి. బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సంజయ్ ​దత్​ బిగ్​బుల్​ అనే పాత్రలో కనిపించనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సంజు ఇందులో విలన్ గా ఉన్నారా అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పటికే సంజయ్​ దత్​ 'కేజీయఫ్'​లో పవర్​ఫుల్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న చాలా వరకు చిత్రాల్లోనూ సంజయ్ విలన్‎గానే కనిపించనున్నారు. కాబట్టి ఈ డబుల్ ఇస్మార్ట్​లోనూ ఆయనే విలన్ అని అందరూ అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ కొత్త పోస్టర్​లో సంజయ్​ దత్​ లుక్​ అదిర్స్ అనిపిస్తోంది. బ్లాక్ కలర్ సూట్​లో​ స్టైలిష్​ హెయిర్​ స్టైల్​ అండ్​ బియర్డ్​ లుక్‎లో ఓ రేంట్ లో అదరగొడుతున్నారు. సీరియస్​గా సిగరెట్​ కాలుస్తూ అందరి మైండ్​ బ్లాక్ చేస్తున్నాడు.

మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ‘డబుల్ ఇస్మార్ట్’ పై ట్రేడ్‌లో అపుడే అంచనాలు మొదలయ్యాయి. పాన్ ఇండియన్ చిత్రంగా వస్తోన్న ఈ మూవీని పూరితో కలిసి ఛార్మీ కౌర్ నిర్మిస్తోంది. 'లైగర్​' డిజాస్టర్ కావడంతో డబుల్ ఇస్మార్ట్​ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళ్తోంది మూవీ యూనిట్. భారీ బడ్జెట్​తో హై స్టాండర్డ్స్​తో చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించేందుకు పూరీ టీమ్ తెగ ప్రయత్నిస్తోంది. ఈ మూవీని మహా శివరాత్రి కానుకగా భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 8 నాటిని విడుదల చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం.






Double ISMART is now Double MASS🔥🔥

Updated : 29 July 2023 11:48 AM IST
Tags:    
Next Story
Share it
Top