చంద్రుని మీద కోట్ల ఆస్తి ఉన్న హీరో ఎవరో తెలుసా?
X
చంద్రుని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పటి నుంచో జరుగుతోంది. చాలా మంది తమకు అక్కడ స్థలాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. తాజాగా గోదావరి ఖనికి చెందిన సుద్దాల సాయి విజ్ఞత తన తల్లికి చంద్రుని మీద భూమిని కొనుగోలు చేశానని చెప్పారు. దీంతో మూన్ మీద రియల్ ఎస్టేట్ మరోసారి తెర మీదకు వచ్చింది. అయితే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏంటంటే...మన ఇండియన్ ష్టార్ హీరోకి చంద్రుని మీద కోట్ల ఆస్తి ఉందన్న సంగతి.
ఎవరబ్బా చంద్రుని మీద అంత ఆస్తి ఉన్న స్టార్ హీరో అని అనుకుంటున్నారా....అదెవరో కాదండీ మన బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్. ఇతనికి మూన్ మీద అతను కోరిన ప్రదేశంలోనే బోలెడు ఎకరాలు ఉన్నాయిట. 2009లో జీ న్యూస్ చేసిన ఇంటర్వ్యూలో షారూఖే స్వయంగా ఈ విషయం చెప్పాడు. ఒక ఆస్ట్రేలియన్ మహిళ తన పుట్టిన రోజు నాడు ప్రతీ ఏడాది చంద్రుని మీద ల్యాండ్ ను కొనుగోలు చేస్తోందని తెలిపారు. లూనార్ రిపబ్లిక్ సొసైటీ నుంచి దానికి సంబంధించిన దృవపత్రాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు. ఈమధ్యనే జరిగిన తన 52వ బర్త్డే నాడు మూన్ మీద తన భూమిని పొందారుట షారూఖ్. అక్కడ ఇతని మొత్తం ఆస్తి ఖరీదు 6,300 కోట్లు. ఇలా అక్కడ మొట్టమొదట స్థలం కలిగిన భారతీయుడుగా షారూఖ్ గుర్తింపు కూడా పొందారు.
షారూఖ్ మొదటి వ్యక్తే కానీ మూన్ మీద ల్యాండ్ ను కొనుగోలు చేసిన ఒకే ఒక వ్యక్తి మాత్రం కాదు. ఎందుకంటే ఇతని తర్వాత దివంగత హీరో సుశాంత సింగ్ రాజ్ పుత్ కూడా అక్కడ ల్యాండ్ ను కొనుగోలు చేశారు. చంద్రునికి అవతలివైపు ఉన్న మారే ముస్కోవియన్స్ లేదా సీ ఆఫ్ మస్కోవి అనే భూమిని కొనుక్కున్నారుట. దీని ధర అప్పట్లో 55 లక్షలు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అంకిత్ గుప్తా, ప్రియాంక చాహర్ లకు కూడా చంద్రుని మీద భూములు ఉన్నాయి. ఇక హాలీవుడ్ సెలబ్రిటీల్లో అయితే జాన్ ట్రావోల్ట్, నికోలో కిడ్మన్, బార్బరా వాల్టర్స్, టామ్ క్రూజ్ లు చంద్రుని మీద భూమిని సొంతం చేసుకున్నారు.
ఇక చంద్రుని మీద ల్యాండ్ అయిన మన విక్రమ్ అక్కడ ఉష్ణోగ్రతలను కాస్త లోతుగా సేకరించింది. మూన్ ఉపరితలం మీద 50 డిగ్రీల ఉష్ణోగ్రత చూపిస్తోందని...అదే 80 మిల్లీ మీటర్ల లోతులోకి వెళితే 10 డిగ్రీలు మాత్రమే ఉందని తెలిపింది. అలాగే విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీద చాలా అద్భుతమైన ఫోటోలను తీసిందని...వాటిని త్వరలోనే విడుదల చేస్తామని ఇస్తరో ఛైర్మన్ చెబుతున్నారు.