Home > సినిమా > మరో స్టార్ హీరోయిన్‎తో బాయ్ ఫ్రెండ్..ఫోటో చూసి షాక్‎లో తమన్నా

మరో స్టార్ హీరోయిన్‎తో బాయ్ ఫ్రెండ్..ఫోటో చూసి షాక్‎లో తమన్నా

మరో స్టార్ హీరోయిన్‎తో బాయ్ ఫ్రెండ్..ఫోటో చూసి షాక్‎లో తమన్నా
X

విజయ్ వర్మ..ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‎లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. దహాద్, డార్లింగ్స్, మీర్జాపూర్, గల్లీబాయ్, లస్ట్ స్టోరీస్ -2 వంటి హిట్ వెబ్ సిరీస్‎తో పాపులర్ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్. ఈ స్టార్ హీరో తమన్నా బాయ్ ఫ్రెండ్‎గానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. రీసెంట్‎గా మిల్కీ బ్యూటీ ఇతడే నా బాయ్ ఫ్రెండ్ అంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అతడిని ఇష్టపడుతున్నట్లు ఓపెన్ అయ్యింది. దీంతో విజయ్ వర్మ పాపులారిటీ మరింత పెరిగింది. ఈ క్రమంలో తాజాగా విజయ్‎కి సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో దుమారం రేపుతోంది. పెళ్లి బట్టల్లో విజయ్ మరో స్టార్ హీరోయిన్‎తో ఉన్న పిక్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. దీంతో విజయ్ కి ఆల్రెడీ పెళ్లైందా అంటూ రూమర్స్ మొదలయ్యాయి.




బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెటిల్ అయినప్పటికీ విజయ్ వర్మకు అంటూ సొంత ఇళ్లు లేదు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. గత 10 సంవత్సరాలుగా ముంబైలో విజయ్ ఏకంగా 14 ఇళ్లు మారాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అదే విధంగా విజయ్‌ వర్మ ఇంటి హాలులో కొన్ని ఫోటోల ఫ్రేమ్‌లు ఉన్నాయి. అందులో ఒక ఫోటోనే విజయ్ పై రూమర్స్ వ్యాపించేలా చేసింది. అందులో అంత ఆసక్తి కరమైన విషయం ఏముందని ఆలోచిస్తున్నారా? అదేమిటంటే, స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్, విజయ్‌ వర్మ ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఇది. అంది కూడా పెళ్లి బట్టలతో.. ఉండటంతో ఈ ఫోటో వైరల్ అయ్యింది. దీంతో పెళ్లైన వ్యక్తినా తమన్నా ప్రేమించిందని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యారు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది.




విజయ్ వర్మ, ఆలియాభట్ డార్లింగ్ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రంలో ఆలియా విజయ్‎కి భార్యగా నటిస్తుంది. అందకే ఫిల్మ్ మేకర్స్ ఆ టైమ్‎లో వీరిద్దరి ఫోటోను పెళ్లి బట్టల్లో తీశారు. ఆఫోటోనే విజయ్ తన ఇంటి హాల్ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఫోటోను చూసి మీడియా అవాక్కయ్యింది. దాని గురించి అడగ్గా ఈ ఆసక్తికరమైన విషయాలను విజయ్ పంచుకున్నాడు. ఒకానొక సమయలో తన తల్లి కూడా ఈ ఫోటోను చూసి షాక్‎కు గురయ్యారట.





Updated : 17 Jun 2023 2:01 PM IST
Tags:    
Next Story
Share it
Top