Home > సినిమా > ఎన్టీఆర్ చిత్రంలో జాన్వీ పాత్ర అదే..

ఎన్టీఆర్ చిత్రంలో జాన్వీ పాత్ర అదే..

ఎన్టీఆర్ చిత్రంలో జాన్వీ పాత్ర అదే..
X

హీరోయిన్‎గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ బ్యూటీ దాదాపుగా నటించిన అన్ని హిందీ చిత్రాలు మిగతా సినిమాలతో పోల్చితే వైవిధ్యంగా ఉంటాయి. దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురే అయినప్పటికీ జాన్వీ కష్టేఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న నటి. నాన్న ప్రొడ్యూజర్ అయినప్పటికీ తన టాలెంట్‎తో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్‎లో ముందుకెళ్తోంది. నార్త్‎లో తన సత్తా చూపించిన జాను ఇప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీపై నజర్ వేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రం దేవరతో తన లక్కును పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాలో జాన్వీ పాత్రకు సంబంధించి అప్‎డేట్ వచ్చేసింది. అమ్మడి పాత్ర ఛాలెంజింగ్‎గా ఉంటుందని తెలుస్తోంది.




దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోను పట్టించడానికి రహస్య ఆపరేషన్‎లో ఉన్న గూఢచారి పాత్ర పోషిస్తోందని తాజా సమాచారం. ఈ మధ్యనే ఈ సినిమాలో జాన్వీ ఫస్ట్ లుక్‎ను యూనిట్ విడుదల చేసింది. ఆ పోస్టర్‎లో జాన్వీ లంగాఓణీ వేసుకుని మత్స్యకార కుటుంబానికి చెందిన పల్లెటూరు అమ్మాయిలా కనిపించింది. అయితే మత్స్యకార కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించినా ఈ సినిమాలో రెండు భిన్న పాత్రలు పోషించనుంది జాన్వీ . ఒకటి మత్స్యకార యువతి కాగా, మరొకటి సీక్రెట్ ఆపరేషన్‎లో ఉన్న గూఢచారి క్యారెక్టర్ పోషిస్తోంది . తొలి సినిమా కావడంతో తన పాత్ర బాగా పండేలా జాన్వీకపూర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది.

Updated : 6 Jun 2023 2:23 PM IST
Tags:    
Next Story
Share it
Top