Home > సినిమా > Poonam Pandey : ‘పూనమ్ పాండే చనిపోలేదు’.. బాంబు పేల్చిన బాలీవుడ్ క్రిటిక్

Poonam Pandey : ‘పూనమ్ పాండే చనిపోలేదు’.. బాంబు పేల్చిన బాలీవుడ్ క్రిటిక్

Poonam Pandey : ‘పూనమ్ పాండే చనిపోలేదు’.. బాంబు పేల్చిన బాలీవుడ్ క్రిటిక్
X

(Poonam Pandey)‘‘బాలీవుడ్ బ్యూటీ, ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే కన్నుమూత’’.. నిన్నంతా వార్తల్లో ఇదే నడిచింది. సోషల్ మీడియాలోనూ ఆమె పేరు ట్రెండ్ అయింది. కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ సంతాపం కూడా తెలిపారు. క్యాన్సర్ తో పోరాడుతున్న పూనమ్ పాండే 32 ఏళ్ల వయసులో మరణించారు. ఈ వార్త తన అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ నుంచి పోస్ట్ వచ్చింది. ‘‘ఇవాళ ఉదయం పూనమ్ పాండే మరణించింది. గర్భాశయ క్యాన్సర్తో ఆమె చనిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాము.’’ అని ఆమె టీం పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో నిన్న (ఫిబ్రవరి 2) ఒకటే రచ్చ. అయితే ఆమె అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ఇది నిజమా, ప్రాంక్ కావొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మరణంతో చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈ క్రమంలో బాలీవుడ్ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు మాత్రం ఓ బాంబు పేల్చాడు. పబ్లిసిటీ స్టంట్ కోసం పూనం ఈ విధంగా నాటకం ఆడుతుందని చెప్పాడు.





పూనం పాండే బతికే ఉందని, ఆమె మరణ వార్తను విని.. ఆమే

స్వయంగా ఆనందిస్తున్నారని ఉమైర్ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘పూనం బతికే ఉంది. నేను ఆమె కజిన్ తో మాట్లాడా. పబ్లిసిటీ స్టంట్ కోసం ఈ విధంగా నాటకం ఆడుతుంది. మరణ వార్త వింటూ ఎంజాయ్ చేస్తుంద’ని ట్విట్టర్ లో ఉమర్ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇది నిజమా? తాను చనిపోలేదా? అంటూ కామెంట్ చేస్తున్నారు.


పలు రొమాంటిక్ సినిమాల్లో పూనమ్ నటించింది. తన సోషల్ మీడియాలోనూ వివాదస్పద పోస్టులతో నిత్యం వార్తల్లో నిలిచేది. ఇక కంగనా హోస్ట్ చేసిన లాకప్ షోలోనూ ఈ అమ్మడు పార్టిసిపెట్ చేసింది. ఎలిమినేషన్ నుంచి తనను కాపాడితే టాప్ లెస్గా కనిపిస్తానని చెప్పింది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్‌ 2013లో ‘నషా’ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. సినిమాల కన్నా వివాదాస్పద కామెంట్లతోనే ఆమె ఎక్కువగా పబ్లిసిటీ పొందింది. 2011 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా భారత్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంకి వస్తానని ప్రకటించిన సంచలనం సృష్టించింది.






Updated : 3 Feb 2024 12:42 PM IST
Tags:    
Next Story
Share it
Top