Home > సినిమా > కోట్ల రూపాయలను ఇట్టే వదిలేసుకుని తన మంచిమనసును చాటుకున్న అక్షయ్ కుమార్

కోట్ల రూపాయలను ఇట్టే వదిలేసుకుని తన మంచిమనసును చాటుకున్న అక్షయ్ కుమార్

కోట్ల రూపాయలను ఇట్టే వదిలేసుకుని తన మంచిమనసును చాటుకున్న అక్షయ్ కుమార్
X

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చాలా మండివాడని పేరుంది. పెళ్ళికి ముందు కాదు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం అతి తక్కువ కాంట్రవర్శీల్లో ఉన్న హీరో ఇతనొక్కడే. ఫ్యామిలీ, దేశం పట్ట చాలా బాధ్యతగా ఉంటాడని అంటారు. అలాంటి అక్షయ్ కుమార్ తన మంచి మనసుతో కోట్ల రూపాయలను వదిలేసుకున్నాడుట.

అక్షయ్ కుమార్ ఈ మధ్యనే తమ భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాడు. అంతేకాదు అతను నటించిన ఓ మైగాడ్ -2 సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదే టైమ్ లో అతని గురించి మరో ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మాథూర్ తన ఆటో బయోగ్రఫీ పిచ్ సైడ్:మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అనే పుస్తకంలో అక్షయ్ గురించి ప్రస్తావించారు. కాంట్రాక్ట్ మధ్యలోనే వదిలేసి భారీ మొత్తాన్ని కూడా లెక్క చేయని అక్షయ్ ప్రవర్తన తనను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని మాథుర్ అందులో రాశారు.

అసలు ఏమైందంటే...ఐపీఎల్...కొన్నేళ్ళుగా క్రికెట్ ను ఏలుతోంది. ఇందులో ఆడటానికి ఇంట్రస్ట్ చూపించని ఆటగాడు ఉండడు. డబ్బులు కూడా చాలా భారీగానే వస్తాయి. ఇందులో ఫ్రాంచైజీలు ఉండడమూ...దానికి సినిమా స్టార్లు ఓనర్లుగా ఉండడం మొదటి నుంచి వస్తూనే ఉంది. ప్రీతిజింటా, షారూఖ్, జుహీ చావ్లా లాంటి వాళ్ళు ఫ్రాంఛైజీ ఓనర్లుగా ఉన్నారు. అలాగే అక్షయ్ కుమార్ కూడా ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఒక ఓనర్ గా ఉండేవాడుట. అయితే ఐపీఎల్ లో ఎంత లాభాలు వస్తాయో...అంతే బారీగా నష్టాలు కూడా వస్తాయి. 2009లో ఢిల్లీ డెవిల్స్ నష్టాల బాటలో ఉంది. అప్పుడు అక్షయ్ కుమార్ తాను ఆ ఫ్రాంచైజీతో చేసుకున్న 3 ఏళ్ళ ఒప్పందాన్ని వదిలేసుకోవాల్సి వచ్చిందట. ప్రమోషన్ ఫిల్మ్స్, ఈవెంట్లలో పాల్గొనడం, కార్పొరేట్ ఈవెంట్లకు హాజరు కావడం లాంటి వాటితో కూడాన కాంట్రాక్ట్ ను అక్షయ్ తో డీడీ చేసుకుంది. అయితే నష్టాలు రావడంతో కాస్ట్ కటింగ్ చేసుకోవాలని భావించింది. దాంతో అక్షయ్ కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోవాలని భావించిందిడీడీ. అయితే న్యాయపరంగా అదంత సులువైన విషయం కాదు. కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నా అక్షయ్ కు భారీ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్ గా అదే టైమ్ లో అక్షయ్ తనకు రావాల్సిన మొత్తాన్ని వదులుకుని కాంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నారుట.

ముందుగా డీడీ లాయర్లు అక్షయ్ సిబ్బందితో కలిశారు. పరిస్థితి వివరించారు. కానీ అతని సిబ్బంది డీల్ ను వదులుకోవడానికి ఇష్టం చూపించలేదు. ఒకవేళ వదులుకున్నా తమకు రావాల్సిన డబ్బు ఇవ్వాల్సిందే అని చెప్పారుట. దీంతో డీడీ యాజమాన్యం నేరుగా అక్షయ్ ను కలిసి పరిస్థితి వివరించాలని అనుకుంది. చాందినీ చౌక్ టూ చైనా షేటింగ్ లో ఉన్న అక్షయ్ ను కలిసి...పరిస్థితి వివరించారు. అలాగే తమ ఆర్ధిక పరిస్ధితిని కూడా వివరంగా చెప్పింది డీడీ యాజమాన్యం. అప్పుడు అక్షయ్ దానిదేముంది...వర్కౌట్ కానప్పుడు వదిలేద్దాం అని సింపుల్ గా చెప్పేశాడుట. న్యాయపరంగా ఉన్న చిక్కులు గురించి కూడా తన లాయర్ తో మాట్లాడతానని...ఏ ఇబ్బంది ఉండదని సింపుల్ గా తేల్చేశాడుట. ఈ మొత్తం వ్యవహారంలో మాథుర్ ఉన్నారు. అంత క్షణాల్లో ఒక కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోవడం, అంత డబ్బును వదిలేయడం మామూలు విషయం కాదంటారు మాథుర్. అందుకే ఈ విషయంలో అక్షయ్ తనకు ఇప్పటికీ చాలా గొప్పగా అనిపిస్తాడని చెబుతున్నారు. అయితే అక్షయ్ ఎంత మొత్తం వదులుకున్నాడనే విషయం మాత్రం ఆయన ఎక్కడా చెప్పలేదు.

Updated : 16 Aug 2023 7:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top