జాతీయ అవార్డ్ కు అల్లు అర్జున్ తో పోటీ పడిన హీరో ఎవరో తెలుసా?
X
మొట్టమొదటిసారి ఓ తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈ వార్త తెలిసినదగ్గర నుంచీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. నేషనల్ వైడ్ పుష్ప, అల్లు అర్జున్ పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. కేవలం 20 ఏళ్ళల్లో 69 ఏళ్ళ తెలుగు సినిమా కలను నెరవేర్చిన హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు.
కానీ ఈ అవార్డ్ కోసం ఇద్దరు హీరోలు పోటీపడ్డారు. చివరి వరకు బన్నీ ఒక హీరో టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. అసలు పోటీలో సూర్య, ధనుష్, ఆర్య ఇలాంటి వారందరూ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చింది మాత్రం ఓ బాలీవుడ్ హీరో. అతనే విక్కీ కౌశల్. 2021లో సర్దార్ ఉదమ్ సింగ్ సినిమాతో విక్కీ అవార్డుల్లో నామినేషన్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో విక్కీ నటనకు చాలా ప్రశంసలు దక్కాయి. మామూలుగానే అతను ఏ పాత్రకైనా ప్రాణం పెడతాడు. సర్దార్ ఉదమ్ సింగ్ లో అయితే సూపర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. దీంతో అవార్డ్ ఎవరికి ఇవ్వాలా అని జ్యూరీ సభ్యులు చాలా ఆలోచించాల్సి వచ్చిందట. చివరకు ఎక్కువ ఓట్లు అల్లు అర్జున్ కే పడటంతో అతనికే అవార్డ్ ను ఖాయం చేశారు.
అసలు 2021లో వచ్చిన సినిమాలు, అవార్డ్ కు నామినేషన్స్ దక్కించుకున్న హీరోలు అందరూ ఓ రేంజ్ ఉన్నావారే. ఎవ్వరినీ కాదనడానికి వీల్లేదు. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ కు చాలా చాలా టఫ్ కాంపిటీషనే పడింది. జైభీమ్ నుంచి సూర్య, కర్ణన్ నుంచి ధనుష్, సార్పట్ట పరంబదురై నుంచే ఆర్య అందరూ మంచి టాలెంట్ ఉన్న నటులే. అలాగే విక్కీ కౌశల్ కూడా. వీళ్లందరినీ నెగ్గుకుని బన్నీ అవార్డ్ దక్కించుకోవడం మామూలు విషయం కాదంటున్నాయి సినీ ఇండస్ట్రీలు. ఇంతటి ఘనత సాధించిన అతన్ని ప్రశంసల్లో ముంచేస్తున్నాయి.