Home > సినిమా > Nora Fatehi : ముంబై మెట్రోలో చిందులేసిన హీరోయిన్.. వీడియో వైరల్

Nora Fatehi : ముంబై మెట్రోలో చిందులేసిన హీరోయిన్.. వీడియో వైరల్

Nora Fatehi : ముంబై మెట్రోలో చిందులేసిన హీరోయిన్.. వీడియో వైరల్
X

బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ముంబై మెట్రోలో చిందులేశారు. ప్రయాణికుల మధ్య డ్యాన్స్ వేస్తూ సందడి చేశారు. తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం తాజాగా ఆమె మెట్రోలో ప్రయాణించారు. ప్రభుదేవా సినిమా సాంగ్ ముక్కాల ముక్కాబులా అనే పాటకు ఆమె మెట్రోలో అదిరిపోయే స్టెప్పులేశారు. తన కో స్టార్స్‌తో కలిసి హుషారుగా డ్యాన్స్ వేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోరా ఫతేహి ప్రస్తుతం హిందీతో పాటుగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తూ వస్తున్నారు.





ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ అనే మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. మార్చి 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ మేకర్స్ అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మడ్ గావ్ ఎక్స్‌ప్రెస్ మూవీలోని 'బేబీ బ్రింగ్ ఇట్ ఆన్' అనే పాటకు నోరా టీమ్ హుషారెత్తించే డ్యాన్స్ వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోకు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు

.


వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నోరా ఫతేహిని ట్రోల్స్ చేస్తున్నారు. ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మెట్రోలో అలా డ్యాన్సులు వేసి న్యూసెన్స్ చేయడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నోరా ఫతేహి తెలుగులో బాహుబలి సినిమాలోని మనహరీ అనే సాంగ్‌లో నటించింది. కిక్2, షేర్, లోఫర్ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.


Updated : 10 March 2024 12:29 PM IST
Tags:    
Next Story
Share it
Top