Home > సినిమా > Barkha Madan : బౌద్ధ సన్యాసినిగా మారిన హీరోయిన్!

Barkha Madan : బౌద్ధ సన్యాసినిగా మారిన హీరోయిన్!

Barkha Madan : బౌద్ధ సన్యాసినిగా మారిన హీరోయిన్!
X

(Barkha Madan) బాలీవుడ్ హీరోయిన్ బర్ఖా మదన్ సన్యాసినిగా మారిపోయింది. బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఆమె ఓ వెలుగు వెలిగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మోడలింగ్‌లో రాణించింది. 1994లో సుస్మితా సేన్, ఐశ్వర్యరాయ్ లతో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. అయితే టైటిల్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత మిస్ టూరిజం ఇండియాగా ఎంపికై బాలీవుడ్ డైరెక్టర్ల కళ్లల్లో పడింది. ఆమె అందానికి బాలీవుడ్ దర్శకులు ఫిదా అయ్యారు. వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి.





1996లో హీరో అక్షయ్ కుమార్‌తో సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు రేఖ, రవీనా టాండన్‌తో కలిసి ఖిలాడియోన్ కా ఖిలాడి మూవీలో నటించి మెప్పించింది. ఆ సినిమాతోనే ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. వరుసగా ఆమె సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో భూత్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీలో దెయ్యం పాత్రలో బర్ఖా మదన్ కనిపించింది. అదేవిధంగా 1857 క్రాంతి సీరియల్‌లో లక్ష్మీబాయి పాత్రలో బుల్లితెర ప్రేక్షకులకు కనిపించింది.





ఈ సీరియల్ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. 2010లో ఆమె నిర్మాతగా మారి సోచ్ లో, సుర్ఖాబ్ అనే చిత్రాలను నిర్మించింది. ఆ తర్వాత ఆమె సినీరంగానికి దూరమైంది. 2012 నుంచి తాను బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు బర్ఖా మదన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను సన్యాసినిగా ఉన్నానని, తన పేరును గ్యాల్టెన్ సామ్ టెన్‌గా మార్చుకున్నట్లు తెలిపింది. దలైలామా బోధనలు వింటూ బౌద్ధ సన్యాసినిగా మారిపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె బౌద్ధ సన్యాసిరాలగా గడుపుతోంది. ఇప్పుడు తనకు ఏ కోరికలూ లేవని, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నానని ఆమె తెలిపింది. బాలీవుడ్‌లో ఈ హీరోయిన్ మాత్రమే కాకుండా జైరా వాసిమ్, సనా ఖాన్‌లు కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నారు.






Updated : 5 Feb 2024 8:33 PM IST
Tags:    
Next Story
Share it
Top