Home > సినిమా > పుష్ప-2లో ఖిలాడీ నంబర్ 1-రూమర్

పుష్ప-2లో ఖిలాడీ నంబర్ 1-రూమర్

పుష్ప-2లో ఖిలాడీ నంబర్ 1-రూమర్
X

సూపర్ సక్సెస్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నరని తెలుస్తోంది. పుష్ప-2 టీజర్ తో అంచనాలను అమాంతం పెంచేసిన సుకుమార్....ఈ సినిమాను వెయ్యి కోట్ల టార్గెట్ తో తీస్తున్నారు. దీని కోసం భారీ ఎత్తున స్టార్ కాస్టింగ్ తీసుకుంటున్నారని సమాచారం. పుష్ఫ-2 మీద అంచనాలను మరింత పెంచేందుకు బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లను నటింపజేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పక్కా సమాచారం ప్రకారం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. చిన్న పాత్రలో అక్షయ్ కనిపించినా కూడా బాలీవుడ్ లో భారీ వసూళ్ళను సాధిస్తుంది. అందుకే ఒక ముఖ్యమైన అతిధి పాత్రలో అక్షయ్ ను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు.

అలాగే ఈ సినిమాలో రష్మిక మాత్రమే కాకుండా ఒక బాలీవుడ్ హీరోయిన్ కూడా నటిస్తుందని చెబుతున్నారు. ఇక మొదటి పార్ట్ లో సమంత తో ఐటం సాంగ్ చేయించారు. ఈ సారి ఎవరు ఐటమ్ సాంగ్ చేస్తారు అనేది కూడా ఆసక్తిగా మారింది.

మొత్తానికి పుష్ప 2 గురించి తరుచుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. వీటిలో ఏది నిజం, ఏది అబద్దం అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. పుష్ప 2 సినిమా , రిలీజ్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




Updated : 10 July 2023 1:58 PM IST
Tags:    
Next Story
Share it
Top