Home > సినిమా > Pushpa-2 : బన్నీతో ఆడిపాడనున్న దీపికా పదుకొనే?..పుష్ప-2 క్రేజీ అప్డేట్

Pushpa-2 : బన్నీతో ఆడిపాడనున్న దీపికా పదుకొనే?..పుష్ప-2 క్రేజీ అప్డేట్

Pushpa-2   : బన్నీతో ఆడిపాడనున్న దీపికా పదుకొనే?..పుష్ప-2 క్రేజీ అప్డేట్
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పా మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అన్ని బాషాల్లో సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారారు. అంతేగాక ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో తన సత్తా చాటింది. ఇందులో బన్నీ యాక్టింగ్, యాస, కొత్త లుక్ కి మంచి మార్కులు పడ్డాయి. అదికాక ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం పుష్పా-2 షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా పుష్పా-3 కూడా ఉంటుందని బన్నీ చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.





పుష్పా-1లో బన్నీతో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది స్టార్ హీరోయిన్ సమంత. ఊ..అంటావా మావ..ఊఊ అంటావా మామ..అంటూ సమంత చేసిన డ్యాన్స్ కి కుర్రకారు ఫిదా అయిపోయారు. మూవీ ఎంత హిట్ అయ్యిందో..ఈ సాంగ్ కూడా అంతే సూపర్ హిట్ అయ్యింది. వివిధ దేశాల్లోని కాన్సర్ట్ లలో కూడా ఈ పాట పాడారు అంటే ఈ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అర్థం చేసుకొవచ్చు. సాంగ్ కు తనదైన శైలిలో గ్లామర్ యాడ్ చేశారు సమంత. అలాగే, పుష్పా-2 లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్.




ప్రస్తుతం డైరెక్టర్ ఇదే పనిపై ఉన్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీతో కలిసి స్పెషల్ సాంగ్ పై కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. పుష్పాలో సమంత సాంగ్ ను మించేలా ఈ పాటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పుష్పా-2 లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సాంగ్ కోసం ముందు ఊర్వశి రౌతెలా, శ్రీలీలా పేర్లు వినిపించినప్పటీకి...దీపికాకే ఓటేస్తున్నారంట బన్నీ, సుకుమార్. మరి ఇది ఎంత వరకు నిజమో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.


Updated : 18 Feb 2024 10:07 AM IST
Tags:    
Next Story
Share it
Top