వైష్ణోదేవి అమ్మవారికి షారుక్ ఖాన్ రహస్యంగా పూజలు
X
దక్షిణాది సినిమాల హవాతో...బాలీవుడ్ ఇండస్ట్రీ డీలా పడిపోయిన టైంలో పఠాన్‌తో తన సత్తాని చూపించారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌ను ఓ రేంజ్లో షేక్ చేసేసింది. వసూళ్ల వర్షం కురిపించింది. అప్పటి వరకు ఉన్న బహుబలి, కేజీఎఫ్ రికార్డులను సైతం తిరగరాసింది పఠాన్. ఈ సినిమాతో కింగ్ ఖాన్ బాలీవుడ్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా పఠాన్ హిట్‌తో మంచి ఊపుమీద ఉన్న షారుఖ్ లేటెస్టుగా జవాన్ సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద రాక్ చేసేందుకు రెడీ అయ్యారు. తమిళ హిట్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మొదటి సారిగా నయనతార షారుఖ్‌తో జోడీ కట్టింది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ నేపథ్యంలో షారుఖ్ తాజా జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది.
మీడియా కంట చిక్కకుండా, ముఖానికి మాస్క్ వేసుకుని సీక్రెట్‌గా షారుఖ్ వైష్ణోదేవి ఆలయని వెళ్లారు. అయితే గుడి ప్రాంగణంలో షారుక్ కనిపించడంతో కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జవాన్ సినిమా కోసమే వైష్ణోదేవి ఆలయంలో షారుక్ పూజలు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇలా షారుఖ్ అమ్మవారి గుడికి రావడం కొత్తేమి కాదు. ఈ ఏడాది ఆయన ఇక్కడికి రావడం ఇది రెండోసారి.
#SRK visited Maa #Vaishnodevi again❤️❤️❤️ pic.twitter.com/s0IJRvoDhG
— अपना Bollywood🎥 (@Apna_Bollywood) August 30, 2023