Home > సినిమా > బాయ్ ఫ్రెండ్‎తో కారులో అడ్డంగా దొరికేసిన అనన్య

బాయ్ ఫ్రెండ్‎తో కారులో అడ్డంగా దొరికేసిన అనన్య

బాయ్ ఫ్రెండ్‎తో కారులో అడ్డంగా దొరికేసిన అనన్య
X

విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో అమ్మడి ఆశలన్నీ ఆవిరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ బ్యూటీ సినిమాలతో కన్నా తన అఫైర్లతోనే బాగా ఫేమస్ అయ్యిందని చెప్పవచ్చు. గత కొంత కాలంగా అనన్య బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‎తో డేటింగ్ చేస్తోందని, వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని పుకార్లు ఇండస్ట్రీలో తెగ షికారు చేస్తున్నాయి. రీసెంట్‎గానే వీరిద్దరూ ఓ బ్రిడ్జిపైన ఒకరినొకరు హగ్ చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. నెట్టింట్లో తెగ హల్ చల్ చేసింది. అయినప్పటికీ ఈ లవ్ బర్డ్స్ వారి రిలేషన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

లేటెస్టుగా మరోసారి అనన్య, ఆదిత్యలు మీడియాకు అడ్డంగా దొరికేశారు. డిన్నర్ డేట్‎కు వెళ్లిన ఈ జోడి కారులో హాయిగా షికారు చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈ జంట ప్రేమ పక్షులు హాయిగా ముంబై వీధుల్లో కారులో జామ్ జామ్ అంటూ షికారుకు వెళ్లారు. ప్రియుడు ఆదిత్య కూల్‎గా కార్ నడుపుతుండగా, అనన్య పక్కనే కూర్చుని ఉంది. ఈ సీన్ అంతా చూసిన మీడియా వారి కెమెరాలకు పని చెప్పింది. ఈ జంట ఫోటోలను కెమెరాల్లో బంధించింది. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా అనన్య తన ముఖాన్ని దాచేందుకు ట్రై చేసింది. ఇక ఆదిత్య మాత్రం కూల్‎గా స్మైల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ లవ్ బర్డ్స్ కారులో తిరుగుతున్న ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.




Updated : 24 July 2023 2:08 PM IST
Tags:    
Next Story
Share it
Top