Home > సినిమా > ఇన్నాళ్లకు.. భార్య చిరకాల కోరిక తీర్చిన భర్త బోనీ కపూర్

ఇన్నాళ్లకు.. భార్య చిరకాల కోరిక తీర్చిన భర్త బోనీ కపూర్

ఇన్నాళ్లకు.. భార్య చిరకాల కోరిక తీర్చిన భర్త బోనీ కపూర్
X

అతిలోక సుందరి శ్రీదేవి తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఈ లోకాన్ని (2018, ఫిబ్రవరి 24) విడిచిపెట్టి పోయినా.. అభిమానుల గుండెల్లో జీవించే ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలంతా శ్రీదేవి డేట్స్ కోసం వెయిట్ చేసేవాళ్లు. కొన్నాళ్లు దుబాయ్ లో ఉన్న శ్రీదేవి ప్రమాదవ శాత్తు బాత్ రూంలో కాలు జారి కిందపడి చనిపోయింది. శ్రీదేవి చనిపోయి ఐదేళ్లు కావస్తుండగా.. తన భర్త బోనీ కపూర్ ఆవిడ చిరకాల కోరిక తీర్చాడు. తన కెరీర్ మంచి పీక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు శ్రీదేవికి ఓ కోరిక ఉండేదట.

ఆ టైంలో చెన్నైకి దగ్గర్లోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో బీచ్ దగ్గర 5 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. తన రిటైర్ అయ్యాక ఆ ప్లేస్ లో తన డ్రీమ్ హౌస్ కట్టుకుని భర్తతో ఉండాలని కలలు కనేది. అయితే ఆ కోరిక తీరకుండానే ఆవిడ చనిపోయింది. ఇన్నాళ్లకు తన భార్య కోరికను తీర్చాడు నిర్మాత బోనీ కపూర్. ఆ స్థలంలో తాజ్ గ్రూప్ పార్ట్ నర్షిప్ తో హజ్ కమ్ హోటల్ ను నిర్మించాడు. రెండేళ్లుగా సాగుతున్న ఆ హోటల్ పనులు తాజాగా పూర్తయ్యాయి. ప్రస్తుతం వాటి ఫొటోలను బోనీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఈ విషయాన్ని పంచుకున్నాడు.

Updated : 20 Aug 2023 10:12 PM IST
Tags:    
Next Story
Share it
Top