Home > సినిమా > BIGG BOSS 7 : బాయ్స్ హాస్టల్లా బిగ్ బాస్ హౌస్.. గ్రాండ్ లాంఛ్ 2.0 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..

BIGG BOSS 7 : బాయ్స్ హాస్టల్లా బిగ్ బాస్ హౌస్.. గ్రాండ్ లాంఛ్ 2.0 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..

BIGG BOSS 7 : బాయ్స్ హాస్టల్లా బిగ్ బాస్ హౌస్.. గ్రాండ్ లాంఛ్ 2.0 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..
X

సరికొత్త ట్విస్టులు.. వినూత్న టాస్కులతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ముందు చెప్పినట్లుగానే ఉల్టాపల్టా సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈసారి ఏడుగురు మేల్, మరో ఏడుగురు ఫీమేల్ కంటెస్టెంట్లతో కలుపుకొని మొత్తం 14 మంది మాత్రమే హౌస్లో అడుగుపెట్టారు. అయితే 4వారాల్లో నలుగురు ఫీమేల్ కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు పోవడంతో హౌస్ లో గ్లామర్ డోస్ తగ్గింది.

బీబీ సీజన్ 7 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీలాను హౌస్ నుంచి బయటకు పంపారు. మూడో వారంలో సింగర్ దామిని ఎలిమినేట్ అయింది. తాజాగా ఫోర్త్ వీక్ ఎలిమినేషన్లో ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్లో ఎవరూ మూటగట్టుకోనంత నెగిటివిటీతో రతిక రోజ్ హౌస్కు గుడ్ బై చెప్పింది. దీంతో హౌస్లో ప్రస్తుతం శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, గౌతమ్ కృష్ణ, సందీప్, అమర్ దీప్, టేస్టీ తేజ, ఫిమేల్ కంటెస్టెంట్లలో శుభ శ్రీ,, శోభా శెట్టి, ప్రియాంక జైన్ మాత్రమే మిగిలారు.

ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉండటంతో బిగ్ బాస్ హోస్లో గ్లామర్ డోస్ తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడుగురు మేల్ కంటెస్టెంట్స్ ఉండటంతో బిగ్ బాస్ హౌస్ దాన్ని బాయ్స్ హాస్టల్లా మార్చేశాడని నెటిజన్లు అంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరికొంత మంది అమ్మాయిల్ని హౌస్లోకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే త్వరలోనే గ్రాండ్ లాంఛ్ 2.0 కోసం బిగ్ బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరికొందరు అమ్మాయిలు పంపితే షో మరింత రంజుగా సాగుతుందని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికే 5 వారాలు గడిచిపోవడంతో ఒకవేళ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటే హౌస్ మేట్ల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ వారంలోనే బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ 2.0 ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ వీకెండ్లో మరో ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అయితే అందులో ముగ్గురు సీరియల్ బ్యాచ్కు చెందిన వారేనన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.




Updated : 4 Oct 2023 4:56 PM IST
Tags:    
Next Story
Share it
Top