Home > సినిమా > Box-Office : వెంకటేష్, నాగార్జున బాక్సాఫీస్ వార్

Box-Office : వెంకటేష్, నాగార్జున బాక్సాఫీస్ వార్

Box-Office : వెంకటేష్, నాగార్జున బాక్సాఫీస్ వార్
X

స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ అంటే ఆడియన్స్ కు ఓ కిక్ ఉంటుంది. ఫ్యాన్స్ కు కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునే అవకాశం వస్తుంది. కాకపోతే ఇవి శ్రుతి మించి ఇతరులను బూతులు తిట్టే వరకూ వెళుతుంది. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది కూడా. ప్రస్తుతం సోషల్ మీడియా ఉంది కాబట్టి మరింత దారుణంగా తయారైంది పరిస్థితి.

అయినా స్టార్ హీరోల మధ్య పోటీ అంటే బాక్సాఫీస్ కూడా హీటెక్కుతుంది. అలాగని అందరు హీరోల విషయంలో ఇది జరగదు. ఇక ప్రస్తుతం సంక్రాంతి బరిలో స్టార్ వార్ జరగబోతోంది. ఈ వార్ లో విచిత్రం వెంకటేష్, నాగార్జున ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న వెంకీ నటించిన సైంధవ్ విడుదలవుతోంది. ఆ తర్వాతి రోజు నాగార్జున నా సామిరంగా వస్తోంది. దీంతో మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అంటూ గతం తవ్వుకుంటున్నారు. మరి ఇప్పటి వరకూ ఈ ఇద్దరు హీరోలు ఎన్నిసార్లు తలపడ్డారు. ఎవరు విన్ అయ్యారు అనేది చూద్దాం..

వెంకటేష్ కు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చిన సినిమా చంటి. తమిళ్ చిన్నతంబికి రీమేక్ గా వచ్చిన చంటితో అతను ఓవర్ నైట్ బిగ్ స్టార్ అయ్యాడు. అప్పటి వరకూ ఎలాంటి ఇమేజ్ వస్తుందా అని రకరకాల ప్రయత్నాలు చేశాడు. బట్ చంటితో ఫ్యామిలీ స్టార్ గా సెటిల్ అయిపోయాడు. అఫ్ కోర్స్ మాస్ ను కూడా మెప్పిస్తూ వస్తున్నాడు. ఈ చంటి 1992 జనవరి 10న విడుదలైంది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

చంటి విడుదలైన రోజే నాగార్జున నటించిన కిల్లర్ రిలీజ్ అయింది. మళయాల దర్శకుడు ఫాజిల్ రూపొందించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఓ కొత్త ప్రయత్నం అనిపించుకున్నా.. సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఆడియన్స ది కాబట్టి ఆ మూవీ ప్రభంజనం ముందు కిల్లర్ జస్ట్ హిట్ అనే మాటకే పరిమితం అయింది. అలా ఫస్ట్ టైమ్ నాగ్, వెంకీ తలపడ్డ బాక్సాఫీస్ వార్ లో వెంకీ అప్పర్ హ్యాండ్ సాంధించాడు.

రెండోసారి వీరు 1996లో తలపడ్డారు. కాకపోతే ఇద్దరి మధ్య రెండు వారాల గ్యాప్ ఉంది.నాగార్జునకు వచ్చిన రొమాంటిక్ హీరో ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లిన సినిమా నిన్నేపెళ్లాడతా. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1996 అక్టోబర్ 4న విడుదలైంది. అప్పటి వరకూ ఉన్న ఫ్యామిలీ సినిమాల టెంప్లేట్ ను బద్ధలు కొట్టి ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది నిన్నే పెళ్లాడతా. నాగ్, టబుల జోడీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న టైమ్ లోనే అక్టోబర్ 17న వెంకటేష్, సౌందర్య నటించిన పవిత్ర బంధం విడుదలైంది. ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కాకపోతే నిన్నేపెళ్లాడతాతో పోలిస్తే కా..స్త తక్కువ హిట్ అంతే. బట్ కమర్షియల్ గా పెద్ద విజయమే.

సో..27యేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ ఈ సంక్రాంతి బరిలో నిలిచారు. ఒక్క రోజు గ్యాప్ లో సినిమాలు రాబోతున్నాయి. నాగార్జున కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో ఉన్నాడు. వెంకటేష్ ఫామ్ లో ఉన్నాడు. పైగా వెంకీ ఇది 75వ సినిమా. కెరీర్ లో స్పెషల్ గా నిలిచేలా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీతో వస్తున్నాడు. నాగార్జున చాలా గ్యాప్ తర్వాత రూరల్ మాస్ కంటెంట్ తో వస్తున్నాడు. మరి ఈ సారి విన్నర్ ఎవరవుతారు అని కాకుండా.. ఇద్దరూ విజేతలుగా నిలవాలనే కోరుకుందాం.

Updated : 3 Jan 2024 4:27 PM IST
Tags:    
Next Story
Share it
Top