Home > సినిమా > అల్లు క్యాంప్ లో బోయపాటి

అల్లు క్యాంప్ లో బోయపాటి

అల్లు క్యాంప్ లో బోయపాటి
X

తెలుగులో ఎక్స్ ట్రీమ్ థింకింగ్ మాస్ డైరెక్టర్ అంటే మరో ఆలోచన లేకుండా గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. ఫైట్ సీన్స్ లో అతని హీరోలైనా విలన్స్ అయినా ఒక్కసారే వంద పూనకాలు వచ్చినట్టుగా రెచ్చిపోతారు. చాలాసార్లు గ్రావిటీని కూడా ఛాలెంజ్ చేస్తాడు బోయపాటి. అందుకే అతనికి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే బాలకృష్ణతో వర్కవుట్ అయినట్టుగా ఇతర హీరోలతో అతని సినిమాలు వర్కవుట్ కావు. కాకపోతే కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇందులోనూ అతని మార్క్ సన్నివేశాలే ఉంటాయి. ఇక చివరగా చేసిన స్కంద సినిమాతో ఆల్మోస్ట్ పరువు తీసుకున్నాడు. ఇంత దారుణమైన సినిమాను ఈ మధ్య కాలంలో చూడలేదు అని రామ్ ఫ్యాన్స్ కూడా ఫీలయ్యారంటే బోయపాటి పైత్యం ఏ రేంజ్ లో కనిపించిందో అర్థం చేసుకోవచ్చు. స్కంద తర్వాత బోయపాటి సినిమా ప్రేక్షకులు భయపడేలా చేసుకున్నాడు అనేది నిజం. అందుకే అతనికి మరో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు వెంటనే సమాధానం రాలేదు. బట్.. ఊహించినట్టుగానే అల్లు అరవింద్ ఆఫర్ ఇచ్చాడు. ఈ మేరకు ఈ కాంబినేషన్ కు సంబంధించిన

అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది

తన కొడుకు అల్లు అర్జున్ కు సరైనోడు వంటి మాస్ హిట్ ఇచ్చాడు అన్న కారణమా లేక ఆల్రెడీ ఇచ్చిన అడ్వాన్స్ కారణమా చెప్పలేం కానీ.. బోయపాటి తర్వాతి సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే చేయబోతున్నాడు. అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తోనే చేస్తారు అనే టాక్ కొన్నాళ్ల క్రితం వచ్చింది. మరి అదే నిజమా కాదా అనేది త్వరలోనే చెబుతారట. మరి ఈ సారైనా బోయపాటి కాస్త తగ్గుతాడేమో చూడాలి.


Updated : 26 Jan 2024 1:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top